Sanju Samson : సంజూ శాంస‌న్ ఔట్ విష‌యంలో పెద్ద వివాద‌.. అంపైర్‌తో గొడ‌వేసుకున్నాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sanju Samson : సంజూ శాంస‌న్ ఔట్ విష‌యంలో పెద్ద వివాద‌.. అంపైర్‌తో గొడ‌వేసుకున్నాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 May 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Sanju Samson : సంజూ శాంస‌న్ ఔట్ విష‌యంలో పెద్ద వివాద‌.. అంపైర్‌తో గొడ‌వేసుకున్నాడుగా..!

Sanju Samson : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ మధ్య ఆస‌క్తిక‌ర ఫైట్ జ‌రిగింది. ఈ ఫైట్‌లో ఆర్ఆర్ కు మరో ఓటమి ఎదురైంది. సమష్టిగా విఫలమైన రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కీలక సమయంలో షై హోప్ సంచలన క్యాచ్‌తో సంజూ శాంసన్ ఔటవ్వడం రాజస్తాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. 222 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్ఆర్ మొద‌ట్లోనే య‌శ‌స్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికి బట్ల‌ర్ కూడా ఔట‌య్యాడు. రియాన్ ప‌రాగ్ కూడా పెద్ద‌గా పరుగులు చేయ‌లేక‌పోయాడు. అయితే ఆ స‌మ‌యంలో సంజూ శాంసన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 28 బంతుల్లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Sanju Samson శాంస‌న్ ఔట్‌పై హైడ్రామా

ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళుతున్న సంజూ శాంస‌న్ క్యాచ్ ఔట్ అయ్యాడు. సంజూ శాంసన్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే, హోప్ కాలు బౌండరీ లైన్‍కు తాకినట్టు అనిపించడటంతో క్యాచ్ చెక్ చేయాలని అంపైర్లను శాంసన్ అడిగాడు. అయితే, థర్డ్ అంపైర్ ఆ క్యాచ్‍ను ఎక్కువ సేపు పరిశీలించలేదు. సంక్లిష్టంగా ఉన్న ఈ క్యాచ్‍పై ఔట్ అని చాలా త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు శాంసన్. ఈ ఔట్ వివాదాస్పదంగా మారింది. అది నాటౌట్ అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఔట్ కాక‌పోయిన ఔట్ ఇచ్చినందుకు క్రీజును వీడేందుకు నిరాకరించాడు సంజూ శాంస‌న్.

Sanju Samson సంజూ శాంస‌న్ ఔట్ విష‌యంలో పెద్ద వివాద‌ అంపైర్‌తో గొడ‌వేసుకున్నాడుగా

Sanju Samson : సంజూ శాంస‌న్ ఔట్ విష‌యంలో పెద్ద వివాద‌.. అంపైర్‌తో గొడ‌వేసుకున్నాడుగా..!

చివరకు అంపైర్లు సర్దిచెప్పడంతో వెనక్కివెళ్లిపోయాడు. కాగా.. శాంసన్ ఔటయ్యాక శుభం దూబే (12 బంతుల్లో 25 పరుగులు) కాసేపు మెరిపించాడు. ఫెరీరా (1), రవిచంద్రన్ అశ్విన్ (2), రవ్మన్ పావెల్ (13) సహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజస్థాన్ ఓటమి పాలైంది.ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (20 బంతుల్లో 50 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శకతంతో మెరుపులు మెరిపించగా.. అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65 పరుగులు; 7ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత హాఫ్ సెంచరీ చేశారు. శాయ్ హోప్ (1), కెప్టెన్ రిషబ్ పంత్ (15), అక్షర్ పటేల్ (15) ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. అయితే, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. దీంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది