Sanju Samson : ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి ర‌నౌట్ చేసిన సంజూ శాంస‌న్‌.. రెండు క‌ళ్లు సరిపోవు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sanju Samson : ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి ర‌నౌట్ చేసిన సంజూ శాంస‌న్‌.. రెండు క‌ళ్లు సరిపోవు

Sanju Samson : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మంచి ర‌స‌వ‌త్తరంగా సాగుతుంది. ప్ర‌తి మ్యాచ్ కూడా ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తుంది. శ‌నివారం (ఏప్రిల్ 03) రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేన 3 వికెట్ల తేడాతో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సాధించింది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించేందుకు సంజూ శాంస‌న్ సేన చెమ‌టోడాల్సి వ‌చ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Sanju Samson : ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి ర‌నౌట్ చేసిన సంజూ శాంస‌న్‌.. రెండు క‌ళ్లు సరిపోవు

Sanju Samson : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మంచి ర‌స‌వ‌త్తరంగా సాగుతుంది. ప్ర‌తి మ్యాచ్ కూడా ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తుంది. శ‌నివారం (ఏప్రిల్ 03) రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేన 3 వికెట్ల తేడాతో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సాధించింది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించేందుకు సంజూ శాంస‌న్ సేన చెమ‌టోడాల్సి వ‌చ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 ప‌రుగులు రాజ‌స్థాన్‌కి టార్గెట్ విధించింది. అయితే ఆర్ఆర్ టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్స్ వెంటవెంట‌నే వెనుదిర‌గ‌డంతో లక్ష్య చేధ‌న కాస్త క‌ష్ట‌మైంది. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించిన చివ‌రిలో హెట్‌మయర్‌ (27*) రాణించ‌డంతో గెలిచింది.

Sanju Samson : వాట్ ఏ ఫీల్డింగ్…

అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కళ్లు చెదిరే రనౌట్‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచ‌డు. వెటరన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మార్క్ వికెట్ కీపింగ్‌‌తో అద‌ర‌హో అనిపించాడు. . సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్‌కు పంజాబ్ కింగ్స్ డేంజరస్ బ్యాటర్ లియామ్ లివింగ్‌ స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.ఇందుకు సంబంధించిన‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సాగుతున్న స‌మ‌యంలో యుజ్వేంద్ర చాహల్ వేసిన 18వ ఓవర్ వేస్తున్నాడు. అయితే ఈ ఓవర్ ఐదో బంతిని పుల్ టాస్‌గా వేయగా.. అషుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. లివింగ్ స్టోన్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించగా.. ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసిన అషుతోష్ శర్మ నిరాకరించాడు.

Sanju Samson ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి ర‌నౌట్ చేసిన సంజూ శాంస‌న్‌ రెండు క‌ళ్లు సరిపోవు

Sanju Samson : ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి ర‌నౌట్ చేసిన సంజూ శాంస‌న్‌.. రెండు క‌ళ్లు సరిపోవు

అయితే అప్ప‌టికే స‌గం పిచ్ వ‌ర‌కు వ‌చ్చిన లివింగ్ స్టోన్ యూటర్న్ తీసుకోగా.. తనూష్ కోటియన్ త్రోను అద్భుతంగా అందుకున్న సంజూ శాంసన్.. ధోనీ తరహాలో బంతిని క్ష‌ణాల‌లో వికెట్లవైపు విసిరేసాడు. బంతిని చూడ‌కుండా వికెట్లను హిట్ చేసి లివింగ్ స్టోన్ ని బ‌య‌ట‌కు పంపించాడు. ఇది చూసి ప్ర‌తి ఒక్కరు స్ట‌న్ అవుతున్నారు. మ‌రో ధోని అంటూ అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌. అప్పటి వ‌ర‌కు దూకుడుగా ఆడిన లివింగ్ స్టోన్ కాసేపు క్రీజులో ఉంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలాంటి ఆట‌గాడిని త‌న మెరుపు ఫీల్డింగ్‌తో ఔట్ చేయ‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది