ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈసారి సరికొత్త నిబంధనలు.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే
ODI World Cup 2023 : క్రికెట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకు క్రికెట్ గురించి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఇటీవలే ఆసియా కప్ పూర్తయిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో గెలిచిన ఉత్సాహంతో ప్రస్తుతం భారత్.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం ఎదురు చూస్తోంది. వన్ డే ప్రపంచకప్ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ లు ఒక ఎత్తు అయితే.. ఈ ప్రపంచకప్ మరోవైపు. ఎందకంటే.. ఈసారి ప్రపంచకప్ లో చాలా నిబంధనలు మారాయి. సరికొత్త నిబంధనలను ఐసీసీ తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఓడీఐ వరల్డ్ కప్ వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 5 న ప్రారంభం కానున్న టోర్నమెంట్.. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.
ఈసారి ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. ఈసారి భారత్ మాత్రమే ఈ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఇదివరకు కూడా ఐసీసీ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చినా.. వేరే దేశాలతో పాటు ఆతిథ్యం ఇచ్చింది. భారత్ 1987 లో, 1996 లో, 2011 లో వన్డే ప్రపంచకప్ కు సంయుక్తంగా హోస్ట్ చేసింది. ఇక.. ఈ సారి వెస్టిండిస్ టీమ్ లేదు. ఈ సారి టోర్నీకి వెస్టిండిస్ జట్టు అర్హత సాధించలేదు. ఈసారి బౌండరీ కౌంట్ నియమాన్ని తీసేశారు. ఎందుకంటే 2019 ప్రపంచ కప్ లో బౌండరీ కౌంట్ నియమం ఉపయోగపడింది. కానీ.. ఈ నిబంధనపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఈసారి ఆ నిబంధనను తీసేసి కేవలం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు. అది కూడా టై అయితే మరో సూపర్ ఓవర్ ఆడతారు.
ODI World Cup 2023 : సాఫ్ట్ సిగ్నల్ నిబంధన రద్దు
ఇక.. ఐసీసీ ఇప్పుడు సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను కూడా రద్దు చేసింది. దాని ప్రకారం థర్డ్ అంపైర్ బ్యాటింగ్ చేసే వ్యక్తి ఔట్ పై నిర్ణయం తీసుకుంటారు. అది ఎప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోలేకపోతే. కానీ.. థర్డ్ అంపైర్ కూడా నిర్ణయం తీసుకోలేకపోతే.. అప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే ప్రకటించాలి. అదే చాలా వివాదాలకు దారి తీయడంతో ఈసారి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేశారు. అంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.