Virat Kohli : తన పేరిట చెత్త రికార్డ్ లిఖించుకున్న విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రావిడ్‌నే అధిగమించాడుగా..!
Virat Kohli : రన్ మెహీన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో దిగాడంటే పరుగుల వరద పారడం ఖాయం. ఇది ఒకప్పుడు ఇప్పుడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సెంచరీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అయింది. ఇటీవల అన్ని ఫార్మాట్స్ నుండి కెప్టెన్‌గా తప్పుకున్న కోహ్లీ ఇక పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఆడతాడని, మునపటి కోహ్లిని చూస్తామని అతడి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా వేచి చూశారు. కానీ కోహ్లి మాత్రం వాళ్లు అతడిపై పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ అదే రీతిలో ఔటవుతున్నాడు.
దక్షిణాఫ్రికాతో నిన్న పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇది 14వ సారి. అంతేకాదు, వన్డేల్లో ఓ స్పిన్నర్ (కేశవ్ మహారాజ్) బౌలింగులో డకౌట్ కావడం కోహ్లీకి ఇదే తొలిసారి. ఈ ఔట్‌తో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్, కపిల్‌దేవ్, రోహిత్ శర్మ చెత్త రికార్డును కోహ్లీ అధిగమించాడు.
Virat Kohli : చెత్త రికార్డులు వశం చేసుకుంటున్నకోహ్లీ..
వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లలో సచిన్ తెందూల్కర్ (20), యువరాజ్ సింగ్ (18), సౌరభ్ గంగూలీ (16) ముందున్నారు. తర్వాత సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు విరాట్ కోహ్లీ (14) జాబితాలోకి చేరాడు. ఆ తర్వాత 13 సార్లు డకౌట్ అయిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలు ఉన్నారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్లో 34సార్లు డకౌట్ కాగా.. కోహ్లీ 31సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. సెహ్వాగ్ కూడా 31 డకౌట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత గంగూలీ (29), యువరాజ్ సింగ్ (26) ఉన్నారు. నేడు సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ ఆడనుండగా, ఈ మ్యాచ్‌లో అయిన రాణిస్తాడా అన్నది చూడాలి.