Virat Kohli : కంటి చూపుతో హార్ధిక్ పాండ్యాకి వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఇందుకో తెలుసా..??
Virat Kohli : టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కొన్నాళ్లుగా సతమతం అవుతున్న కోహ్లీ శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ కొట్టి కదం తోక్కాడు. అయితే శ్రీలంకతో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో రెండో పరుగుకు రానందుకు గానూ.. అతడిని డెడ్లీ లుక్‌తో భయపెట్టాడు. కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌండరీలు, సిక్సర్లు కంటే కూడా వికెట్ల మధ్య పరుగులు తీయడంలో అతడికి అతడే సాటి అని చెప్పాలి.. ఫోర్లు, సిక్సర్లు కొట్టకపోయినా.. సింగిల్స్ అయినా తీస్తూ ఉండాలి అని అనుకుంటాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉంటే వికెట్ల మధ్య వీరిద్దరి పరుగులను కట్టడి చేయాలంటే ప్రత్యర్థి ఫీల్డర్లు చెమటలు పట్టాల్సిందే.
అంతగా కోహ్లీ, ధోని సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిస్తారు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ ఒకవైపు బౌండరీలు బాదుతూ మరోవైపు సింగిల్స్‌పై దృష్టి పెడుతున్నాడు. అయితే ఎలాంటి భావోద్వేగాన్నైనా వెంటనే మైదానంలో చూపించే కోహ్లీ.. నిన్నటి మ్యాచ్‌లోనూ హార్దిక్‌పై తన కోపాన్ని వెళ్లగక్కాడు. 43వ ఓవర్‌లో కసున్ రజిత్ వేసిన లెంగ్త్ డెలివరీని ఆన్ సైడ్ బీహైండ్ స్క్వేర్ ఆడిన కోహ్లీ చాలా స్పీడ్‌గా సింగిల్ తీశాడు. అయితే డబుల్ తీసేందుకు ప్రయత్నించగా.. హార్దిక్ మాత్రం ప్రతిస్పందించలేదు. దీంతో వెనక్కి వెళ్లిన విరాట్.. పరుగు తీయనందుకు హార్దిక్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతడిని కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ డెడ్లీ లుక్‌కు హార్దిక్ కూడా భయపడినట్లు కెమెరాలలో కనిపించింది.
Virat Kohli ; కంటి చూపుతో..!!
సారీ అంటూ చేతితో సంకేతమిచ్చాడు. అనంతరం కోహ్లీని డైరెక్టుగా చూడలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు ,వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ మ్యాచ్ లో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో సచిన్ చేసిన 20 శతకాల రికార్డును విరాట్ అందుకున్న కోహ్లీ, శ్రీలంకపై టెండూల్కర్ సాధించిన 8 సెంచరీల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ శ్రీలంకపై తన శతకాల సంఖ్యను 9కి పెంచుకున్నాడు. వన్డేల్లో విరాట్ కిది 45వ శతకం కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో 73వ సెంచరీ. రానున్న రోజులలో సచిన్ రికార్డులని చెరిపేయనున్నాడు.