Virat Kohli : లక్నోతో ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న కోహ్లీ.. ఆర్సీబీకి గుడ్ బై చెప్పనున్నాడా..!
ప్రధానాంశాలు:
Virat Kohli : లక్నోతో ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న కోహ్లీ.. ఆర్సీబీకి గుడ్ బై చెప్పనున్నాడా..!
Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేలవ ప్రదర్శన కనబరుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా ఈ టీమ్ అందుకోలేకపోయింది. ఇటీవల ఆర్సీబీ మహిళా జట్టు ట్రోఫీని దక్కించుకోగా, అదే ఉత్సాహంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ మెన్స్ జట్టు కూడా ట్రోఫీ దక్కించుకుంటుందని అంతా భావించారు. కాని ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. మిగతా జట్లన్నీ తమ సొంతగడ్డపై విజయాలు సాధిస్తుంటే.. ఆర్‌సీబీ మాత్రం హోమ్ గ్రౌండ్‌లో కూడా పరాజయం పాలవుతుండడం అభిమానులని ఎంతగానో కలవరపరుస్తుంది. ఇప్పుడు ఆర్సబీ జట్టు .. పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
Virat Kohli ఆర్సీబీని కోహ్లీ వీడబోతున్నాడా..
అయితే మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచితీరుతుందని అందరు అనుకున్నారు. కాని బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరచి భారీ ఓటమిని మూటగట్టుకుంది. 28 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోవడం ఎవరికి మింగుడుపడడం లేదు. ఫీల్డింగ్‌లో సునాయస క్యాచ్‌లు నేలపాలు చేయడంతో కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. బాధను భరించలేక తాను కూర్చున్న కుర్చీని గట్టిగా గుద్దుతూ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇక ఓటమి నేపథ్యంలో విరాట్ చాలా నిరాశకు గురయ్యాడు. చాలా సేపటి వరకు మౌనంగా కూర్చుండి పోతూ ఏదో ఆలోచనలో పడినట్టు వీడియోలలో కనిపించింది. ఆర్సీబీ ప్రదర్శనతో విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రచారం జరుగుతుంది.
ఇక అంతా క్లోజ్ అయింది. ఆర్సీబీకి గుడ్‌బై చెప్పేందుకు కింగ్ రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తుంది. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతూ వస్తున్న విరాట్ కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉండగా, ఈ సమయంలో తన జట్టు ఇలా ఓటమి పాలవుతుండడం విరాట్‌ని చాలా బాధిస్తుందట. ఒక్కడు ఎంత బాగా ఆడిన కూడా తన టీమ్ గెలవకపోవడంతో కోహ్లీ.. ఆర్సబీ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆర్సీబీ పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా మారుతుండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో కోహ్లీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 203 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. లక్నోతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులు చేయగా, వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు.