SRH : హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పనున్న సన్‌రైజర్స్ ?
ప్రధానాంశాలు:
SRH : హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పనున్న సన్‌రైజర్స్ ?
SRH : ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. విశాఖపట్నంలో సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ముందు, ఈ వివాదం బయటకు రావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఉప్పల్ స్టేడియం నిర్వహణలో హెచ్‌సీఏ వైఖరిని విమర్శిస్తూ సన్‌రైజర్స్ ఓ లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. లేఖలో HCA తమను గత రెండేళ్లుగా వేధిస్తున్నదని, తగినంత ఉచిత టికెట్లు కేటాయించలేదనే అబద్ధపు కారణాలతో బెదిరిస్తున్నదని ఆరోపించింది. ఈ వివాదం ఇంకా కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని వదిలి, తమ హోం గ్రౌండ్‌ను మారుస్తామని హెచ్చరించడంతో చర్చనీయాంశంగా మారింది.

SRH : హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పనున్న సన్‌రైజర్స్ ?
హెచ్‌సీఏ పై సంచలన ఆరోపణలు చేసిన SRH
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 12 ఏళ్లుగా ఉప్పల్ స్టేడియంలో తమ హోం మ్యాచులను నిర్వహిస్తుండగా, గత రెండు సంవత్సరాలుగా HCA అధికారం దుర్వినియోగం చేస్తూ, వేధింపులకు గురి చేస్తోందని ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం HCA కు 3900 ఉచిత టికెట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అదనంగా మరిన్ని టికెట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. గత మ్యాచులో F-3 కార్పొరేట్ బాక్స్‌ను లాక్‌చేయడం, అదనంగా 20 టికెట్లు ఇవ్వాలని బలవంతం చేయడం, లేదంటే స్టేడియంలో అనుమతి నిరాకరించని హెచ్చరించడం వంటి చర్యలు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ సమస్యను పలుమార్లు అధికారికంగా హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోకపోవడం మరో నిరాశాజనక విషయం.
ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ వైఖరిని మార్చుకోకపోతే హైదరాబాద్ నగరాన్ని వదిలి కొత్త వేదికను అన్వేషిస్తామని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ఇది తెలంగాణ క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. బీసీసీఐ మరియు తెలంగాణ ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే, తమ హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో హెచ్చరించారు. ఈ విషయంపై అధికారిక ప్రకటనలు వచ్చే వరకు నిజానిజాలు తెలియవు. కానీ, ఈ వివాదం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోకపోతే, హైదరాబాద్ అభిమానులు ఇష్టపడే సన్‌రైజర్స్ జట్టు మళ్లీ ఇక్కడ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవచ్చు.