Airtel : శుభవార్త చెప్పిన ఎయిర్‌టెల్.. వంద జీబీ డేటా ఫ్రీ..!
ప్రధానాంశాలు:
Airtel : శుభవార్త చెప్పిన ఎయిర్‌టెల్.. వంద జీబీ డేటా ఫ్రీ..!
Airtel : స్మార్ట్ ఫోన్‌లో ఒకప్పుడు 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించేవారు. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ని ఎంత కావాలంటే అంత పెంచుకునే సదుపాయం కల్పించారు. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఫోన్ స్టోరేజ్ విషయంలో అంతగా ఇబ్బందులు ఎదురు కావడం లేదు. ప్రస్తుతం 128జీబీ మొదలుకొని 256 జీబీ, 512జీబీ, 1టీబీ వరకు ఫోన్లలో స్టోరేజ్ కెపాసిటీని అందిస్తున్నారు.

Airtel : శుభవార్త చెప్పిన ఎయిర్‌టెల్.. వంద జీబీ డేటా ఫ్రీ..!
Airtel మీకొక శుభవార్త..
అయితే ప్రస్తుతం ఫోన్ల వాడకం పెరిగింది. కెమెరాతో ఫొటోలు, వీడియోలను అధికంగా తీసుకుంటున్నారు. మరోవైపు వాట్సాప్‌తో సహా సోషల్ మీడియా యాప్స్‌ను అధికంగా వాడుతున్నారు. దీంతో స్టోరేజ్ సరిపోవడం లేదు. వారికి ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ భాగస్వామ్యంతో కస్టమర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సేవను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఇక మీ డివైజ్ స్టోరేజ్ లిమిట్ సమస్య ఉండదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఆరు నెలలపాటు 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు.
ఐతే, పోస్ట్‌పెయిడ్, వై-ఫై కస్టమర్‌లకు మాత్రమే ఈ సర్వీస్ వర్తిస్తుంది. ఆరు నెలల ఫ్రీ సర్వీస్ తర్వాత, ప్రతినెల రూ.125 ఛార్జెస్ వర్తిస్తాయి. కస్టమర్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించకూడదని అనుకుంటే.. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేయవచ్చు.యూజర్లు తమ డివైజ్ లోని స్టోరేజీ కోసం తరచుగా ఫైల్‌లను తొలగిస్తూ ఉంటారు. మనలో చాలా మంది స్టోరేజ్ కోసం ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసే ఉంటాం. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ అందిస్తున్న 100 GB క్లౌడ్ స్టోరేజ్ చాలా యూజ్ అవుతుంది