Instagram : ఇంస్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ .. రీల్స్, పోస్ట్ లు షెడ్యూల్ చేయండిలా..!
ప్రధానాంశాలు:
Instagram : ఇంస్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ ..
రీల్స్, పోస్ట్ లు షెడ్యూల్ చేయండిలా..!
Instagram : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినా ఇంస్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. ఈ యాప్ లో ఫాలోవర్లతో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. రీల్స్ కూడా షేర్ చేయవచ్చు. అయితే ఇంస్టాగ్రామ్ కొన్ని అడ్వాన్స్ ఆప్షన్లు అందిస్తుంది. అందులో ఒకటే రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసే ఆప్షన్. ముందుగా ఫోన్లో ఇంస్టాగ్రామ్ యాప్ ని ఓపెన్ చేసి కింద కనిపించే ‘ + ‘ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత షెడ్యూల్ చేయాలనుకుంటున్న కంటెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో రీల్స్ లేదా పోస్ట్స్ ఉంటాయి. రీల్స్ లేదా పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే గ్యాలరీ లేదా కెమెరా నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత నచ్చిన విధంగా కంటెంట్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్లు, స్టిక్కర్లు, టెక్స్ట్ ,మ్యూజిక్ వంటి వాటిని యాడ్ చేయవచ్చు. ఎడిటింగ్ పూర్తయ్యాక నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పై నొక్కాక షెడ్యూల్ కంటెంట్ ఆప్షన్ వస్తుంది. దానిపై నొక్కాలి షెడ్యూల్ థీస్ పోస్ట్ లేదా షెడ్యూల్ థిస్ రీల్ ఎంచుకోవాలి. తర్వాత కంటెంట్ పబ్లిష్ అవ్వాల్సిన డేట్, టైం ఎంపిక చేసుకోవాలి. షెడ్యూల్ చేయాలంటే ప్రస్తుత సమయం నుంచి కనీసం 10 నిమిషాల సమయం ముందు టైం ఎంచుకోవాలి. తర్వాత సెట్ టైం పై నొక్కి ప్రీవియస్ స్క్రీన్ కి వెళ్లి టైమ్స్ సెలక్షన్ నిర్ధారించడానికి షెడ్యూల్ పై టాప్ చేయాలి.
అంతే కంటెంట్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో సక్సెస్ ఫుల్ గా షెడ్యూల్ అవుతుంది. ఈ కంటెంట్ ఎప్పుడైనా వ్యూ చేయవచ్చు. మ్యానేజ్ చేయవచ్చు. షెడ్యూల్ కంటెంట్ ను చూడటానికి ప్లస్ ఐకాన్ లేదా ప్రొఫైల్ పై నొక్కవచ్చు. షెడ్యూల్ చేసిన పోస్టులు, రీల్స్ ను చూడగలిగే షెడ్యూల్డ్ ట్యాబ్ ప్రొఫైల్ పేజీ అందుబాటులో ఉంటుంది. షెడ్యూల్ కంటెంట్ ను మేనేజ్ చేయడానికి ఏదైనా పోస్ట్ లేదా రీల్ పై నొక్కి త్రీ డాట్స్ అయితే క్లిక్ చేయాలి. అప్పుడు రీ షెడ్యూల్ షేర్ నౌ, డిలీట్ అని వస్తుంది. వీటిలో కావాల్సిన దానికి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే యూజర్లు పబ్లిక్ అకౌంట్లో నుంచి మాత్రమే కంటెంట్ షెడ్యూల్ చేయగలరు. ప్రోడక్ట్ ట్యాగ్స్, కొలాబరేషన్, ఫేస్ బుక్ క్రాస్ పోస్టింగ్, స్పాన్సర్స్ షిప్లు లేదా ఫండ్ రైజర్స్ గల కంటెంట్ను షెడ్యూల్ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ ఫీచర్లు ప్రస్తుతానికి షెడ్యూల్ చేసిన కంటెంట్ కి అనుకూలంగా లేవు.