Meta AI : భారత్‌లోకి మెటా ఏఐ.. వాట్సప్, ఎఫ్‌బీ,ఇన్‌స్టాలో ఏఐ అసిస్టెంట్ ఎలా ఉపయోగిస్తారు..!
ప్రధానాంశాలు:
Meta AI : భారత్‌లోకి మెటా ఏఐ.. వాట్సప్, ఎఫ్‌బీ,ఇన్‌స్టాలో ఏఐ అసిస్టెంట్ ఎలా ఉపయోగిస్తారు..!
Meta AI : జుకర్ బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ ఇప్పుడు ఇండియాలోకి కూడా అడుగుపెట్టింది. యూజర్లు నేరుగా తమ మెసేజింగ్‌లో నేరుగా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకునే వెసులుబాటు లభించింది. కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉండే మెటా ఏఐ భారత్ సహా పరిమిత దేశాల్లో లభిస్తుంది. ఏఐ అసిస్టెంట్ యూజర్లకు మెరుగైన సంభాషణల సామర్ధ్యం, సమాచార అన్వేషణ, నేరుగా వాట్సాప్‌లోనే సూచనలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.మెటా రూపొందించిన అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో వాట్సప్ యూజర్లు ఎలాంటి ప్రశ్నలు అయినా అడగవచ్చు.మెటా ఏఐ దగ్గర కావలసిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.
Meta AI భారత్‌లోకి మెటా ఏఐ..
మెటా ఏఐ వాట్సప్, ఎఫ్‌బీ,ఇన్‌స్టా, మెసెంజర్‌తో సహా అన్ని కంపెనీ యాప్‌లలో ఆంగ్లంలో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్‌లో మెటా సంస్థ లామా 3 ద్వారా ఆధారితమైన మెటా ఏఐ కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఉగాండా, జింబాబ్వేతో సహా డజనుకు పైగా దేశాలలో కంపెనీ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. మెటా ఏఐ సాయంతో వాట్సప్ గ్రూప్ చాట్‌లో దగ్గర్లోని రెస్టారెంట్లో వివరాలు తెలుసుకోవచ్చు. రోడ్డుపై వెళుతున్నప్పుడు కాసేపు విడిది కోసం ఎక్కడ ఆగొచ్చు ఆరా తీయోచ్చు. వెబ్‌లో మల్టిపుల్ ఛాయిన్ టెస్ట్‌ని క్రియేట్ చేయమని కూడా మెటా ఏఐని కోరవచ్చు.
ఫేస్ బుక్ వాడుతున్నప్పుడు మీకు కావల్సిన ఫీడ్‌ని వెతికిపెట్టడంలో మెటా ఏఐ సాయంగా ఉంటుంది. ఓ పోస్ట్‌పై లోతై సమాచారం తెలుసుకునేందుకు వాడుకోవచ్చు. ఏదైన పర్యాటక స్థలం చిత్రం ఎఫ్‌బీలో కనిపించినప్పుడు .. అక్కడికి వెళ్లడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఏఐ అసిస్టెంట్‌ని అడిగితే సరిపోతుంది. ఎవరైనా గ్రూప్ ట్రిప్ కోసం సిఫార్సులు లేదా డిన్నర్ పార్టీ కోసం రెసిపీ ఆలోచనలను అడగవచ్చు. మెటా ఏఐ నేరుగా చాట్‌లో ఆప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు టైప్ చేయడం ప్రారంభించినప్పుడు, టైప్ చేసిన ప్రతి కొన్ని అక్షరాలతో మారుతున్న చిత్రం కనిపిస్తుంది.