Redmi A3x : రెడీమీ నుండి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ధ‌ర ఎంతో తెలిస్తే అవాక్క‌వుతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Redmi A3x : రెడీమీ నుండి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ధ‌ర ఎంతో తెలిస్తే అవాక్క‌వుతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Redmi A3x : రెడీమీ నుండి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ధ‌ర ఎంతో తెలిస్తే అవాక్క‌వుతారు..!

Redmi A3x : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థ Xiaomi సంస్థ అతి చవకైన ధరల‌తో మార్కెట్‌లోకి వెరైటీ ఫోన్స్‌ని ప్రవేశ‌పెడుతుండ‌డం మ‌నం చూస్తూత‌నే ఉన్నాం. ఈ క్రమంలోనే Redmi A3x ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎంట్రీ-లెవల్ డివైజ్‌ సరసమైన ధరలో అవసరమైన ఫీచర్లను అందిస్తుంది. గతంలో ఈ ఫోన్ అమెజాన్‌పై లిస్ట్ అయ్యింది. కానీ.. ఎట్టకేలకు ఇప్పుడు అధికార వెబ్‌సైట్ ద్వారా సేల్‌కి అందుబాటులోకి రావ‌డం జ‌రిగింది. యూనిసోక్ టీ 603 ప్రాసెసర్ తో పని చేయడంతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుందీ ఫోన్. సర్క్యులర్ కెమెరా డెకో డిజైన్, ట్రాన్స్‌పరెంట్ మిర్రర్ షీన్ గ్లాస్ రేర్ ప్యానెల్‌తో అందుబాటులో ఉంటుంది.

Redmi A3x మంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్..

Redmi A3x రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.6,999 కాగా.. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగుల్లో అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ మరియు స్టార్రీ వైట్. వినియోగదారులు Amazon India లేదా Xiaomi అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, షియోమీ ఇండియా వెబ్‌సైట్‌ల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ గ్రీన్, అలీవ్ గ్రీన్, స్టారీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రెడ్ మీ ఏ3ఎక్స్ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.71 అంగుళాల హెచ్డీ+ (720×1650 పిక్సెల్స్) ఎల్‌సీడీ డాట్ డ్రాప్ స్క్రీన్ కలిగి ఉంటుంది.

Redmi A3x రెడీమీ నుండి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధ‌ర ఎంతో తెలిస్తే అవాక్క‌వుతారు

Redmi A3x : రెడీమీ నుండి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ధ‌ర ఎంతో తెలిస్తే అవాక్క‌వుతారు..!

ఈ ఫోన్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షించబడింది. గీతలు, చిన్న చుక్కల నుండి కొంత స్థాయి వరకు ప్రొటెక్షన్‌ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ T603 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Mali G57 MP1 GPUతో జత చేయబడింది. స్టోరేజీ పరంగా చూస్తే.. Redmi A3x ఫోన్ 4GB వరకు LPDDR4x RAM, 128GB eMMC 5.1 అంతర్గత స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక మైక్రో SDXC స్లాట్ ద్వారా స్టోరేజీ ని 1TB వరకు విస్తరించుకునే అవ‌కాశం ఉంది. యాప్‌లు, ఫోటోలు, వీడియోల కోసం తగినంత స్పేస్‌ ఉండేలా రూపొందించబడింది. ఇవికాక.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.4, Wi-Fi 802.11 b/g/n, 4G VoLTE, GPS వంటి ఫీచ‌ర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది