Barrelakka : బర్రెలక్క ఓటమి.. అయినా తగ్గేదేలే.. చచ్చేలోపు అసెంబ్లీలో అడుగు పెడతా అంటున్న బర్రెలక్క..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka : బర్రెలక్క ఓటమి.. అయినా తగ్గేదేలే.. చచ్చేలోపు అసెంబ్లీలో అడుగు పెడతా అంటున్న బర్రెలక్క..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 December 2023,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Barrelakka : బర్రెలక్క ఓటమి.. అయినా తగ్గేదేలే..

  •  చచ్చేలోపు అసెంబ్లీలో అడుగు పెడతా అంటున్న బర్రెలక్క..!

Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ,  కొల్లాపూర్ ఎన్నికల ఫలితాలలో బర్రెలక్క ఓటమి పాలయ్యారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అందరి దృష్టిని ఆకర్షించారు. విజిల్ గుర్తుకు ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్కకు మొదటి రౌండ్లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్లో 262 ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఆమె 4 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఈమెపై కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇక ఓటమిపాలైన బర్రెలక్క మీడియాతో ముచ్చటించారు. నాకు ఎన్ని ఓట్లు వచ్చాయని బాధపడను, ఒక్క రూపాయి ఇవ్వకుండా నా మీద ఉన్న నమ్మకంతో వేసిన ఓట్లు కాబట్టి నాకు సంతోషంగానే ఉంది.

పుట్టగానే ఎవరు నడవరు. కాబట్టి ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా గెలుస్తాను అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నాకు చాలామంది ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నించినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఓడిపోయినందుకు నేనేమీ బాధపడను, పోరాటం చేస్తూ ఉంటాను. ఈ ఎమ్మెల్యే పదవి రాకపోతే ఎంపీ పదవికి పోటీ చేస్తాను. చాలా మందికి ఒక అపోహ ఉంది. నేను చాలా నిరుపేద రాలిని అని, ఆమెకే లేనప్పుడు మాకేం సహాయం చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ నాకేమీ లేకపోవచ్చు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ద్వారా నేను ప్రజలకు సాయం చేయగలను కానీ అది తెలియక కొందరు ఇలా అపోహ పడుతున్నారు.

ఎవరు గెలిచినా నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి. కొల్లాపూర్ నియోజకవర్గం లో రోడ్లు బాగోలేదు. నిరుద్యోగ సమస్య ఎలా ఉందో కొల్లాపూర్ లో రోడ్ల సమస్య ఉంది. రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ముందు రోడ్లను బాగు చేయాలి అని చెప్పుకొచ్చారు. మొత్తం 119 స్థానాలలో హస్తం గుర్తు 64 సీట్లను దక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు భారీ మెజార్టీతో గెలుపొందారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది