Akhil Akkineni : కొండా సురేఖని వదిలే ప్రసక్తే లేదు.. అక్కినేని హీరో అల్టీమేటం..!
Akhil Akkineni : తెలంగాణా రాజకీయ వాదనల్లో భాగంగా అందుకు ఏమాత్రం సంబంధం లేని సినిమా వాల్లను తెచ్చి ఇరికించడంతో వ్య్వహారం వేడెక్కింది. కే టీ ఆర్ ను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖా మహ్యలో నాగార్జున, నాగ చైతన్య, సమంతల పేర్లు తీసుకొచ్చింది. దాని వల్ల మ్యాటర్ వేరే లెవెల్ కి వెళ్లింది. సినీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ పై సినీ సెలబ్రిటీస్ అంతా స్పందించారు. స్టార్ […]
ప్రధానాంశాలు:
Akhil Akkineni : కొండా సురేఖని వదిలే ప్రసక్తే లేదు.. అక్కినేని హీరో అల్టీమేటం..!
Akhil Akkineni : తెలంగాణా రాజకీయ వాదనల్లో భాగంగా అందుకు ఏమాత్రం సంబంధం లేని సినిమా వాల్లను తెచ్చి ఇరికించడంతో వ్య్వహారం వేడెక్కింది. కే టీ ఆర్ ను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖా మహ్యలో నాగార్జున, నాగ చైతన్య, సమంతల పేర్లు తీసుకొచ్చింది. దాని వల్ల మ్యాటర్ వేరే లెవెల్ కి వెళ్లింది. సినీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ పై సినీ సెలబ్రిటీస్ అంతా స్పందించారు. స్టార్ హీరోలంతా ఈ మ్యాటర్ పై ఫైర్ అయ్యారు. ఐతే ఈ విషయంపై అక్కినేని అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల గురించి అఖిల్ స్పందిస్తూ ఇలాంటి నిరాధారమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారని అన్నారు. ఈ సంఘటన తమ ఫ్యామిలీని ఎంతో మనోవేదనకు గురి చేసింది. అగౌరవానికి గురయ్యారని అన్నారు. ఆ మహిళా మంత్రి సమాజ సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని అన్నారు.
Akhil Akkineni ప్రజల సంక్షేమాన్ని కోరడం పోయి..
ప్రజా ప్రతినిధిగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని కోరడం పోయి మానవత్వపు విలువలు మర్చిపోవడం సిగ్గుచేతని అన్నారు. ఇది క్షమించరానిదని.. సమాజంలో గౌరవ స్థానంలో ఉన్న తన ఫ్యామిలీపై ఆమె తీవ్రంగా అవమానంగా చేసిన వ్యాఖ్యలను ఆమెకు తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. ఆమె లాంటి సంస్కారహీనులకు సమాజంలో స్థానం లేదని.. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంతటితో వదిలేదు లేదని.. దోషులకు శిక్ష పడాల్సిందే అని అఖిల్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో మెసేజ్ రాసుకొచ్చారు.
ఇప్పటికే కొండా సురేఖ మీద నాగార్జున పరువునష్టం దావా కేసు వేశారని తెలిసిందే. కష్టకాలంలో తనతో పాటే ఉన్న సినీ పరిశ్రమకు నాగార్జున తన ధన్యవాదాలు తెలిపారు. ఏఎన్నార్ ఆశీస్సులు మాకు ఉంటాయని ఫ్యామిలీ కోసం తాను సిం హంలా పోరాడటానికి సిద్ధమని అన్నారు నాగార్జున.