Kadiyam Srihari : కడియం శ్రీహరికి బిగ్ షాక్? కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య?
Kadiyam Srihari : తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దానికి కారణం తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అందులో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. అందులో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా ఉన్నారు.ఆయనపై ఇటీవల చాలా ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్ నవ్య కూడా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆయన్ను ఈసారి పక్కన పెట్టింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. దీంతో రాజయ్య తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
తనకే టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ హైకమాండ్ కు చెప్పే ప్రయత్నం చేశారు. హైకమాండ్ పట్టించుకోవడం లేదు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే పార్టీలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే హన్మకొండలో ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. వాళ్ల భేటీలో రాజయ్య కాంగ్రెస్ చేరిక గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ నేతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు రాజయ్య రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాజయ్య కాంగ్రెస్ లో చేరితే ఆయన అనుచరులు, అభిమానులు చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.
Kadiyam Srihari : రాజయ్య కాంగ్రెస్ లో చేరితే కడియం ఓటమి ఖాయం
అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మైనస్ అనే చెప్పుకోవాలి. నియోజకవర్గంలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తే ఇక నియోజకవర్గంలో కడియం గెలుపు కష్టమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే.. రాజయ్య కాంగ్రెస్ లో చేరితే ఘనపూర్ సీటును బీఆర్ఎస్ వదులుకోవాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?