Farmer : అన్నదాతలకు శుభవార్త.. రైతుల అకౌంట్లో డబ్బులు..!
ప్రధానాంశాలు:
Farmer : అన్నదాతలకు శుభవార్త.. రైతుల అకౌంట్లో డబ్బులు..!
farmer : తెలంగాణ రాష్ట్రంలో సన్నధాన్యం సాగు పెంపే లక్ష్యంగా మద్దతు ధర అందించడంతో పాటు అదనంగా కాంగ్రెస్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి, రెండు నెలలు కావస్తున్నా బోనస్ పూర్తిస్థాయిలో పడకపోవడంతో రైతులకు ఎదురు చూపులే దిక్కయ్యాయి.

Farmer : అన్నదాతలకు శుభవార్త.. రైతుల అకౌంట్లో డబ్బులు..!
అయితే అన్నదాతల నిరీక్షణకు తెర పడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల అకౌంట్లలోకి బోనస్ డబ్బులు జమ కానున్నాయి. వరంగల్ వ్యవసాయ అధికారులు బోనస్ డబ్బులు పొందని రైతులకు తీపికబురు అందిస్తూ త్వరలోనే వీరికి డబ్బులు జమ కానునన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం విడతల వారీగా బోనస్ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది రైతులకు బోనస్ డబ్బులు లభించాయని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయని చెప్పారు.
రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు 50 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా వరి 36.21 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.