Breaking : రేపు కొనాయపల్లికి సీఎం కేసీఆర్.. నామినేషన్ పేపర్లకు ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Breaking : రేపు కొనాయపల్లికి సీఎం కేసీఆర్.. నామినేషన్ పేపర్లకు ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  వేంకటేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

  •  ఈనెల 9న నామినేషన్ వేయనున్న కేసీఆర్

  •  ఒకే రోజు గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్

CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొనాయపల్లిలో ఆయన పర్యటిస్తారు. కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అది కేసీఆర్ కు సెంటిమెంట్ ఆలయం. అందుకే ఆ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తన ఫ్యామిలీతో కలిసి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక.. ఈనెల 9న సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో రేపు వేంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పేపర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు ఎన్నికల అధికారుల వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఇక.. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకే రోజు 9న రెండు నియోజకవర్గాలకు నామినేషన్లను ఫైల్ చేయనున్నారు. అందుకే రేపు కొనాయపల్లిలో వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక.. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్తికావస్తోంది. ఇవాళ్టి పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. నేటితో యాగం సంపూర్ణం కానుంది. గత రెండు రోజుల నుంచి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగాన్ని జరిపిస్తున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వరకు సీఎం కేసీఆర్ షెడ్యూల్ బిజీబిజీగా ఉండనుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా బీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది