Uppal : ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uppal : ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,11:00 pm

ప్రధానాంశాలు:

  •  Uppal : ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర..!

Uppal  : రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న స‌న్న‌బియ్యం ప‌థ‌కం పేద‌ల‌కు వ‌రంగా మారింద‌ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గారు పేద‌ల ప‌క్ష‌పాతిగా స‌న్న బియ్యం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు.బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం చిలకానగర్ లోర్యాలీ నిర్వ‌హించారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి,రామాంతపూర్ డివిజన్ అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడారు.

Uppal ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

Uppal : ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర..!

Uppal  చిల్కానగర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను, మన రాజ్యాంగాన్ని అవ‌మానించే బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దాడులు చేస్తున్నాయ‌ని గుర్తు చేశారు. ఈ దాడులను క్షేత్ర‌స్థాయి నుంచే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేడ్క‌ర్‌ను గౌర‌వించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందన్నారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ రాజ్యంలో ప్ర‌జాపాల‌న న‌డుస్తుంద‌న్నారు. యువ వికాసం వంటి ప‌థ‌కాలు నిరుద్యోగుల‌కు వ‌రంగా మారుతాయ‌న్నారు.

అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు, రేష‌న్ కార్డుల‌ అందేలా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమం లో చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్, ఆగం రెడ్డి, కొంపల్లి బాలరాజు, బొట్టు రాజేష్, నల్లవల్లి మహేందర్ అమరేశ్వరి, గండికోట గణేష్, దండుగుల్ల శంకర్, మాము నజీర్, శ్రీరాములు, జంగన్న, సుబ్బారావు, నారోజు రాధాకృష్ణ, అమర్, సత్యం, BM కిరణ్, జగదీశ్వర్, పిట్టల సాయిలు,పాశం శ్రావణ్, సురేష్ గుప్తా, అల్తాఫ్ అర్జున్, గీత, సంపూర్ణ, సమత, రంగమ్మ, B.జ్యోతి, K. జ్యోతి, విజయ, భాగ్యలక్ష్మి, సునీత, నౌకాంత్ రెడ్డి, కిరణ్, సోనా, సందీప్, విక్కీ, ప్రణీత్, అభినయ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ సీనియర్ నాయకులు ,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది