Ticket Price Hike : అల్లు అర్జున్ కి అలా.. పవన్ కళ్యాణ్ కి ఇలా.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!
ప్రధానాంశాలు:
మళ్లీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగరవెయ్యాలనేది రేవంత్ , పవన్ , చంద్రబాబు ల కుట్ర - దేశపతి శ్రీనివాస్
సినిమా టికెట్ ధరలు పెంచానని చెప్పిన రేవంత్.. పవన్ కళ్యాణ్ సినిమాకు ఎలా పెంచాడు..?
Ticket Price Hike : సినిమా టికెట్ల పెంపు.. అల్లు అర్జున్ కి అలా.. పవన్ కళ్యాణ్ కి ఇలా.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!
Ticket Price Hike : సినీ టికెట్ల ధరల వివాదంపై తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇప్పుడు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ లో టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మాట తప్పాడు అని బిఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు.

Ticket Price Hike : అల్లు అర్జున్ కి అలా.. పవన్ కళ్యాణ్ కి ఇలా.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!
Ticket Price Hike : పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ వీరిదంతా ఒకటే బంధం – దేశపతి శ్రీనివాస్
తాజాగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ కు వీరమల్లు ‘ముల్లు’ దిగిందని అన్నారు. మొన్నటి వరకు సినిమా టికెట్ ధరలు పెంచమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ ఈరోజు ఎలా టికెట్ ధరలు పెంచడాన్ని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చా..? అని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ లో కేసీఆర్..తెలుగు దేశం పార్టీ లేకుండా చేస్తే..ఇప్పుడు రేవంత్, చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , మోడీ వీరంతా కలిసి మళ్లీ తెలంగాణ లో టీడీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు రేవంత్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.