Medchal : మేడ్చల్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..!
ప్రధానాంశాలు:
Medchal : మేడ్చల్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..!
Medchal : ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల క్రింద రూ.4 కోట్ల విలువైన చెక్కులను 389 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఘట్కేసర్లో 116 మంది, కాప్రాలో 36 మంది, మేడ్చల్లో 52 మంది, మూడు చింతలపల్లిలో 25 మంది, మేడిపల్లిలో 102 మంది, షామీర్పేట్లో 58 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

Medchal : మేడ్చల్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..!
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్,మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ అమర్ సింగ్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి,మాజీ కార్పొరేటర్లు భీంరెడ్డి నవీన్ రెడ్డి, సుభాష్ నాయక్,సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, బొడిగె కృష్ణ,యాసారం మహేష్, వివిధ మండలాల, మున్సిపాలిటీల చైర్మన్లు, తహశీల్దార్లు,పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.