Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం మొదటి విడత ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా…!
Mahalakshmi scheme : సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కు ముందు 6 హామీలను ఇవ్వటం జరిగింది. మహాలక్ష్మి పథకం ప్రజాపాలన అప్లికేషన్ వలన మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ ప్రజలు తొందరలో దాని ప్రయోజనాలను పొందవచ్చు. రేవంత్ రెడ్డి ముఖాముఖితో మొత్తం ఆరు హామీల ప్రక్రియను ఎంతో వేగవంతం చేశారు. లబ్ధిదారులు అందరూ మహాలక్ష్మి పథకం మొదటి విడత మొత్తం లోక్ సభ ఎన్నికల తరువాత రూ.2500 ఇస్తున్నట్లు తెలిపారు. మనకు తెలిసినట్లుగా మరియు ప్రజా పాలన ఇతర పథకాల కోసం అభ్యర్థుల నుండి ఎన్నో దరఖాస్తులను స్వీకరించారు.దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో ఉన్నందున అప్లికేషన్ డేటా తొందరగా డిజిటల్ చేసేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీ పురోగతికి సంబంధించి వివరాలను రేవంత్ రెడ్డి సేకరించడం జరిగింది. అలాగే వీటిని వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని ఆయన మండలాలు మరియు కార్యాలయాల్లో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే. లోక్ సభ ఎన్నికలకు ముందే అన్ని పథకాలను అమలు చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం తన లక్ష్యంగా పెట్టుకున్నది..
Mahalakshmi scheme : తెలంగాణ మహిళలకు మూడు ప్రయోజనాలను ప్రకటించారు
– తెలంగాణ అంతట ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. వీటిని ప్రతి మహిళ ఉపయోగించుకుంటుంది.
-రూ.2500 నెలసరి సహాయం.
-గ్యాస్ సిలిండర్ లభ్యత రూ.500.
ఈ రెండు ప్రయోజనాల అమలు అనేవి పురోగతిలో ఉన్నాయి. దీని కోసం లోక్ సభ ఎన్నికల లోపు వాటిని పూర్తి చేసే అవసరం సీఎం కు ఉన్నది..
మహాలక్ష్మి పథకం దరఖాస్తు గుణాంకాలు : మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారుతెలిపారు. దాదాపుగా అన్ని దరఖాస్తులకు కూడా డేటా ఎంట్రీ అనేది పూర్తి అయ్యింది, దాదాపు 91.49 లక్షల మంది మహిళలు రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను,మరియు 92.23 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ₹2,500 ఆర్థిక సహాయ ప్రయోజనం కింద అమలు చేయడం జరిగింది. ఈ రెండు ప్రయోజనాల కోసం మాత్రమే కాకా అన్ని ఇతర పథకాల కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి..
మహాలక్ష్మి పథకం అప్లికేషన్స్ స్థితి తనిఖీ : అప్లికేషన్ డేటా నమోదు దాదాపుగా పూర్తి అయింది. కావున ప్రతి ఒక్కరు తమ దరఖాస్తులు తనిఖీ చేసేందుకు అవకాశం అందించటం జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుల వివరాలు నమోదు చేసిన వివరాలు సరైనవో కాదో ఒకసారి తనిఖీ చేసుకుంటే మంచిది. నమోదు చేసినట్టు వివరాలు సరిగ్గా లేకున్నట్లయితే లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించేందుకు మరియు దరఖాస్తులు ధ్రువీకరించేందుకు ప్రభుత్వ అధికారులు మీ ఇళ్లకు రాబోతున్నారు. అవసరం అయినా పత్రాలను కూడా వారికి చూపించాలి. దీంతో మీరు వివరాలను సరి చేసుకోవచ్చు.
మహాలక్ష్మి పథకం ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు మార్గదర్శకాలు : వీలైనంత తొందరగా ఫీల్డ్ వెరిఫికేషన్ మొదలు పెట్టాలి అని రేవంత్ రెడ్డి అధికారులను కోరటం జరిగింది. లబ్ధిదారులను గుర్తించేందుకు మరియు ప్రభుత్వ అధికారుల కోసం ఎన్నో మార్గదర్శకాలు కూడా రూపొందించడం జరిగింది. ఇవి ఇప్పటికీ చర్చలోనే ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆరు హామీలపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అనేది ముగిసిన తరువాత అన్ని పథకాలకు లబ్ధిదారులకు గుర్తించేందుకు అధికారులకు ఈ మార్గదర్శకల ను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు..