Etela Rajender : ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
Etela Rajender Resign హుజూరాబాద్ నియోజకవర్గం మాజీ మంత్రి ఈటేల రాజేందర్ Etela Rajender తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ ఎస్ ) పార్టీకి మరియు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. ఈటేల రాజేందర్ ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లడుతూ ఉరిశిక్షపడే ఖైదికి కూడా తన చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఎవరో ఒకరు లేఖ రాస్తే నాపై విచారణ జరుపుతారా ఈటల రాజేందర్ తెలిపారు. ఎవరిని సంప్రదించకుండా రాత్రికి రాత్రే నన్ను బర్తఫ్ చేశారు. హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఈటెల రాజేందర్ Etela Rajender స్థానం సంపాదించుకున్నాడు. హుజూరాబాద్‌లో ఎప్పడు ఎన్నికలు జరిగినా టీఆర్ ఎస్ పార్టీని నేను గెలిపించానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
నీ కూతురికి బిఫాం ఇచ్చావ్ గెలిచిందా.. ఈటేల రాజేందర్

Etela Rajender Resign To TRS party And MLA
కరీంనగర్ జిల్లాలో ఎంతో మందికి బీఫాం లు ఇచ్చారు కానీ గెలవలేదు, అలాగే సొంత కూతురుకి కూడా బిఫాం ఇచ్చారు కానీ గెలవలేదు అని ఈటెల తెలిపారు. కరీంనగర్‌లో ఈటెల రాజేందర్ అనే టీఆర్ ఎస్ సైనికుడు, ఈటేల రాజేందర్ అను ఒక సామాన్య కార్యకర్తలు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. తెలంగాణ ఉద్యమం పేరున నేను గెలిచాను. తెలంగాణ ఆత్మగౌరవం బావుట ఎగరడం కోసం మా నాయుకుడు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఆనాడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. అయితే ఆనాడు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అందులో 7 మంది మాత్రమే గెలిచాం అందులో నేను ఒకడిని అని ఈటేల రాజేందర్ పేర్కొన్నారు.
ఆనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నన్ను పట్టుకోని, పట్టుమని పది మంది గెలవలేదు రాజేంద్ర మీ మోఖం ఎక్కడ పెట్టకుంటారు అని నన్ను ప్రశ్నిస్తే, ఐదుగు గెలిచామా, పది మంది గెలిచామా కాదు కానీ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ వచ్చే వరకు మా రాజీనామాలు అగవని ఈటేల రాజేందర్ తెలిపారు. అయితే బొగ్గుగణిలో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు అక్కడ ఏం పని ఉంది అని ఈటేల అన్నారు. సీఎం కేసీఆర్ గారు నాతో తెలంగాణ గడ్డపై ఏ సంఘాలు, సమ్మెలు ఉండొద్దని చెప్పారు. ముఖ్యంత్రి కేసీఆర్‌కు నాకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ ఏర్పడింది అని ఈటేల స్పష్టం చేశారు. రైతుబంధు నేను వ్యతిరేకించలే కానీ ఐటీలు కట్టేవారికి ఎందు అని, దున్నడం రానోడు కార్లలో పోయి డబ్బులు తీసుకుంటుంటే పేద రైతు ఏం కావాలి అని నేను సీఎం గారితో అన్నాను.