Etela Rajender : మీడియాతో మాట్లాడని ఈటల.. ఢిల్లీలో ఏం జరిగింది…?
Etela rajender మాజీ మంత్రి ఈటల రాజేందర్ Etela rajender నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. గత మూడు రోజులుగా ఢిల్లిలో బిజీగా బీజేపీ నాయకులను కలిసారు. ఈటల రాజేందర్ బిజేపీలో చేరిక విషయంపై కీలన నాయకులతో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా శంషాబాదర్ హెర్‌పోర్ట్‌లో ఈటల ను బీజేపీలో చేరుతున్నారా అని ప్రశ్నంచగా ఆయన జవాబు ఇవ్వలేదు. ఢిల్లిలో తనకు లభించిన హామిల విషయంపై కూడా నోరు విప్పలేదు. ఆయనతో పాటు సీనియర్ నేత వివెక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. మీడియాతో మాట్లాడకుండా నేరు ఈటల రాజేందర్ Etela rajender వెళ్లిపోయారు.
మరో వైపు ఈటల రాజేందర్ Etela rajender అతి త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈటల హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిద్యం వహిస్తున్నాడు. బిజేపీ అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ ఈ వారంలో చేరే అవకాశం ఉంది. ఈటలతో పాటు మరో ఐదుగురు కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మీరందరిని పార్టీలో చేర్చుకోవడానికి బిజేపీ తెలంగాణ నాయకులు కూడా ఆహ్వానిస్తున్నారు. జూన్ 04 న హుజురాబాద్ వెళ్లి అక్కడ వారి అభిమానులతో చర్చించి త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉంది.