Crop Loan Waiver : హామీ ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ.. నిండా మునిగాక ఎందుకు నీ రుణమాఫీ.. కేసీఆర్‌పై విమర్శలు
Crop Loan Waiver : 2018 ఎన్నికల ముందు ఇచ్చిన మాట.. ఆ హామీ ఇప్పుడు నెరవేర్చబోతున్నారు సీఎం కేసీఆర్. అవును.. అదిగో రుణమాఫీ.. ఇదిగో రుణమాఫీ అంటూ చెప్పుకుంటూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం చివరకు 2023 ఎన్నికల ముందు రుణమాఫీకి వేళయింది. వచ్చే ఎన్నికల్లో రైతుల ఓట్లు పడాలంటే ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో రైతుల ఓట్లు పడకపోతే కష్టమే అనుకున్నారో ఏమో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రూ,19 వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వెంటనే అధికారులు కూడా రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు.
అయితే.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. పలువురు ఉద్యోగులను కూడా తన బుట్టలో వేసుకుంటున్నారు అనిపిస్తోంది ఆయన చేసే పనులు చూస్తే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి రుణమాఫీని అమలు చేయడం లాంటి నిర్ణయాలు చకచకా తీసుకుంటున్నారు. కేబినేట్ భేటీ అంటారు.. వెంటనే కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.నాలుగేళ్ల నుంచి వడ్డీల మీద వడ్డీలు వేలకు వేలు కట్టారు రైతులు. నాలుగేళ్ల నుంచి రుణమాఫీ చేయకుండా నాన్చుకుంటూ వచ్చి చివరకు ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తూ దానికి సంబురాలు ఏంటి అంటూ రైతులు ఫైర్ అవుతున్నారు. సంబురాలు చేయండి అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Crop Loan Waiver : వేలకు వేలు వడ్డీ కడితే సంబురాలు ఏంటి?
రుణమాఫీ ఎందుకు ఆలస్యం అయింది అనే దానిపై కేసీఆర్ కొత్త కథను అల్లారని చెబుతున్నారు. కేంద్రం తీరు వల్ల రుణమాఫీ ఆలస్యం అయిందని చెబుతున్నారు కానీ.. అసలు ఇదంతా ఎన్నికల స్టంట్ అని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇప్పటి వరకు వేలకు వేలు వడ్డీలు కట్టాం. ఇక ఇప్పుడు రుణ మాఫీ అంటూ మీరు రుణాలు మాఫీ చేసినా మేము తీసుకున్నదానికి ఎక్కువే కట్టాం అని రైతులు వాపోతున్నారు. చూద్దాం మరి రుణమాఫీ అంశం బీఆర్ఎస్ కు ఎంత వరకు కలిసి వస్తుందో?