Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు డబ్బులు వచ్చేశాయ్…చెక్ చేసుకోండి..!
Rythu Bandhu : టిఆర్ఎస్ హయాంలో రైతుబంధు నిధులు ఒకటి రెండు రోజుల వ్యవధిలో రైతన్నల ఖాతాలలో జమ అయ్యేవి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం ఉన్న రైతులకు కూడా డబ్బులు జమ కాలేదు. మూడు వారాల కిందటనే డబ్బులు జమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. మొదట పది గుంటల భూమి ఉన్న రైతులు ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం. తర్వాత అరెకరం ఉన్న రైతులకు నిధులను జమ చేసింది. ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరం పై భూ విస్తరణం కలిగిన రైతులకు డబ్బు జమ కాలేదు.
రైతుబంధు డబ్బులు జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గుంటల వారిగా డబ్బులను జమ చేస్తుంది. ప్రభుత్వం నిన్నటి వరకు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు అన్నదాతలు.. కేవలం కుంటతల్లోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా.. ఎకరాకి పైన ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ కాలేదు. దీంతో ఎంతో కాలం నుంచి ఎదురుచూసిన వాళ్లకు ప్రస్తుతం వారి ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి. ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్నవారికి వారి ఖాతాలో డబ్బులు జమయ్యాయి.
ఒకటి లేదా రెండు రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయనున్నారు మీరు కూడా రైతుబంధు లబ్ధిదారులు అయితే మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. రెండు రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇకనుంచి రైతుబంధు స్థానంలో రైతు భరోసా. ద్వారా డబ్బులను రైతన్నల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు జమ చెయ్యనున్నది..