MLA Harish Rao : రైతుబంధు పథకం గురించి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన హరీష్ రావు ..!!

Authored By aruna | The Telugu News | Published on: December 10, 2023, 1:30 pm

MLA Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పటి నుంచి ఇస్తారో ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబంధు ప్రతి ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు అది కూడా డిసెంబర్ 9న రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామని అన్నారు. రైతుబంధు డబ్బుల కోసం ప్రజలు రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ఏదైనా ప్రకటన చేస్తారని అనుకున్నాం. కానీ అలాంటి ప్రకటన చేయలేదు అని హరీష్ రావు తెలిపారు. ఎకరానికి 7500 చొప్పున రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని కోరారు. రైతుబంధు ఎప్పుడు వేస్తారో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నామని చెప్పారు.

ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంటలు ప్రారంభం అయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారంలోపు రైతుబంధు వేసామని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మరో వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి క్వింటాల్ కి గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి వడ్లు త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. రైతులు రోడ్లపై దాన్యపు రాశులు ఆరబెడుతున్నారని, తుఫాను కారణంగా వర్షాలు పడుతుండడంతో దాన్యం తడిసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులంతా ప్రభుత్వం ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నికల ప్రచారంలో మీరు వడ్లు అమ్ముకోవద్దు. మేము అధికారంలోకి రాగానే ప్రతి క్వింటాలకి 500 బోనస్ ఇస్తామని, వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. మీరు ప్రకటించిన 500 బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారో, బోనస్ తో కూడిన వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అని రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ పెద్దలే వారికి స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే విమర్శలు చేయడం లేదని, ప్రజల పక్షాన రైతుల పక్షాన అడుగుతున్నామని అని హరీష్ రావు తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఆరోగ్యారెంటీలలో ఒకటైన గృహలక్ష్మి పథకాన్ని అమలు చేశారు ఇక ఇప్పుడు రైతుబంధు పథకం అమలు చేస్తారేమో చూడాలా అది ఎప్పుడు అమలు చేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp