Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాక్ అయినా జేపీ నడ్డా..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాక్ అయినా జేపీ నడ్డా..!
Pawan Kalyan : ప్రస్తుతం తెలంగాణ Telanganaలో ఎన్నికల వాతావరణం హీట్ గా నడుస్తుంది. అధికార పార్టీ అయినా బీఆర్ఎస్ BRS Party పై కాంగ్రెస్ Congress Party , బీజేపీ BJP Party గట్టి పోటీ చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ Pawan Kalyan జనసేన పార్టీ తెలంగాణలో కొన్ని చోట్ల ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంది. కూకట్పల్లిలో జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కూకట్ పల్లి లో జరిగిన బహిరంగ సభ లో జెపి నడ్డా మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
బిఆర్ఎస్ అంటే అవినీతి రాక్షసుల సమితి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాఫెల్ కామన్వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంలా మారింది అని ఆయన అన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు నిర్మించామని, ఆ పథకాన్ని కెసిఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, ఉచితంగా నాలుగు సిలిండర్లు, ఎరువులు సబ్సిడీగా ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. . జనసేన పార్టీ ఆవిర్భావం తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణలో జరిగిందని అన్నారు. తమకు స్ఫూర్తినిచ్చిన బిజెపితో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ యువత కోరుకున్నది ఒక్కటే, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. తాము సాధించుకున్న తెలంగాణలో అవినీతి ఉద్యోగాలు సాధించుకునేందుకేనా అని ప్రశ్నించారు. అందుకే నిరుద్యోగులు, యువత కష్టాలకుతోడుగా ఉంటానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. అయితే ఈ బహిరంగ సభ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున రావడంతో వీళ్ళని అదుపు చేయలేక పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చూసిన జేపీ నడ్డా ఆశ్చర్య పోయినట్లుగా తెలుస్తుంది.