Kalvakuntla Kavitha : యువతతో ఇంటరాక్ట్ అయిన కల్వకుంట్ల కవిత వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalvakuntla Kavitha : యువతతో ఇంటరాక్ట్ అయిన కల్వకుంట్ల కవిత వీడియో..!

Kalvakuntla Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మహిళా విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు అన్నారు. యువతలో చైతన్యం రావాలన్నారు. స్వేచ్ఛాయుతంగా ఉండడం అనేది ముఖ్యం అన్నారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలని, మీరు గట్టిగా ఓటేస్తే మంచి గవర్నమెంట్ వస్తే మంచి పనులు జరుగుతాయని అన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉందని ఆమె చెప్పుకొచ్చారు. యువత సోషల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Kalvakuntla Kavitha : యువతతో ఇంటరాక్ట్ అయిన కల్వకుంట్ల కవిత వీడియో..!

  •  నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మహిళా విద్యార్థులతో సమావేశం

Kalvakuntla Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మహిళా విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు అన్నారు. యువతలో చైతన్యం రావాలన్నారు. స్వేచ్ఛాయుతంగా ఉండడం అనేది ముఖ్యం అన్నారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలని, మీరు గట్టిగా ఓటేస్తే మంచి గవర్నమెంట్ వస్తే మంచి పనులు జరుగుతాయని అన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉందని ఆమె చెప్పుకొచ్చారు. యువత సోషల్ మీడియాను వాడుకోవాలని సూచించారు.

తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే దేశీ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని, యువత భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు. ఇక ఆడవాళ్లు చాలా బాధ్యతాయుతంగా ఉంటారని, రాష్ట్రం కోసం మహిళలు బాధ్యతగా ఉండాలని తప్పనిసరిగా ఓట్లు వేయాలని ఆమె కొత్త ఓటర్లకు సూచించారు. దేశం మొత్తం మీద గవర్నమెంట్ జాబ్స్ మన రాష్ట్రం ఎక్కువగా ఇచ్చింది. 2,32,000 జాబ్స్ ను ఇప్పటికే అనౌన్స్ చేశామని, కొన్ని పరీక్షల అవుతున్నాయి కొన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి. చాలామంది టెన్షన్ పడుతున్నారు.

కానీ తెలంగాణ గ్రేట్ పాలసీని అందిస్తుంది. ఇప్పటికే 22,000 ప్రైవేట్ కంపెనీలు మన దగ్గరికి వచ్చాయి దీంతో 30 లక్షల మందికి డైరెక్ట్ ప్రైవేట్ జాబ్ వస్తుంది. 2 లక్షల 32 వేల గవర్నమెంట్ జాబులు ఇవ్వగలిగామని కల్వకుంట్ల కవిత యువతకి తెలియజేశారు. ఇక మహిళలు పాలిటిక్స్ లోకి రావాలంటే అన్ని సమస్యలను ఎదుర్కోవాలి ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి వాళ్ల సపోర్ట్ లేకుండా రాజకీయాలలోకి రావద్దు అని అన్నారు వచ్చాక వెను తిరగవద్దు అని అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది