KCR : సాగర్ లో గట్టి పోటీనే.. అటు నుండి నరుక్కు వస్తున్న కేసీఆర్..!
KCR : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ వచ్చింది. గత రెండు మూడు నెలల నుండే నాగార్జున సాగర్ లో ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. అభ్యర్థులు ఖరారు కాకుండానే పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టాయి. అధికార పార్టీ అన్ని రకాలుగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఎంత చేసినా కూడ ఆ సాగర్ లో జానారెడ్డి మీద గెలవడం సాధ్యం అయ్యే పని కాదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నాడట. అందుకే కేసీఆర్ అన్ని రకాల మార్గాల్లో కూడా సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు మరియు విశ్లేషకుల అంచనా నేపథ్యంలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట.
సాగర్ లో జానా రెడ్డికి నమ్మకమైన కాంగ్రెస్ నాయకులను మండల స్థాయి కార్యకర్తలను టీఆర్‌ఎస్ లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ సూచన మేరకు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు అక్కడకు వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారట. కేసీఆర్ ఇచ్చిన హామీలను వారికి వివరించి కాంగ్రెస్ ను వీడేలా చేస్తున్నారట. కాంగ్రెస్ ను వీడి టీఆర్‌ఎస్ లో జాయిన్ అయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందనే నమ్మకంను వారికి కల్పించేలా కేసీఆర్ వ్యూహం పన్నాడు. దాంతో కేసీఆర్ ప్లాన్ కు జానా రెడ్డి గింగిరాలు తీరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జానారెడ్డి కాంగ్రెస్ కు ఆశా జ్యోతిగా ఉన్నాడు. తెలంగాణలో పార్టీ మళ్లీ జీవం పోసుకోవాలంటే ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి ఉంది. కాని కేసీఆర్ అటు నుండి నరుక్కు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా ఇక్కడ తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాని వారు ఈసారి మూడవ స్థానంలో నిలవాల్సి రావచ్చు అంటున్నారు. కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థి జానా రెడ్డి అనిపిస్తుంది కనుక ఆయన్ను ఎదుర్కొనేందుకు అన్ని దారులు వాడుతున్నాడట.