KCR : కేసీఆర్ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సర్వే ఫ‌లితాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : కేసీఆర్ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సర్వే ఫ‌లితాలు..!

KCR : తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఎన్నికల్లో ఎవరి అంచనాలు వారివి అన్నట్లుగా ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎలాంటి డౌట్ లేకుండా టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది అంటూ కేసీఆర్ వర్గం ధీమాగా ఉంది. మరో వైపు ఇతర పార్టీల నాయకులు మరియు పోటీ చేసిన వారు కూడా కేసీఆర్ కు షాక్ తప్పదు అంటున్నారు. టీఆర్‌ఎస్ కు గట్టి బుద్ది చెప్పినట్లుగా పట్టబద్రులు ఓట్లు వేశారంటూ విపక్ష పార్టీల నాయకులు మరియు […]

 Authored By himanshi | The Telugu News | Updated on :15 March 2021,3:40 pm

KCR : తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఎన్నికల్లో ఎవరి అంచనాలు వారివి అన్నట్లుగా ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎలాంటి డౌట్ లేకుండా టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది అంటూ కేసీఆర్ వర్గం ధీమాగా ఉంది. మరో వైపు ఇతర పార్టీల నాయకులు మరియు పోటీ చేసిన వారు కూడా కేసీఆర్ కు షాక్ తప్పదు అంటున్నారు. టీఆర్‌ఎస్ కు గట్టి బుద్ది చెప్పినట్లుగా పట్టబద్రులు ఓట్లు వేశారంటూ విపక్ష పార్టీల నాయకులు మరియు ఇండిపెండెంట్‌ గా పోటి చేసిన వారు కేసీఆర్‌ పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ కు ఒక చోట తప్పితే మరో చోట అయినా షాక్‌ తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఈ సమయంలో ఒక సర్వే ఫలితం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజక వర్గం నుండి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి పై కేసీఆర్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో పల్లా కోసం పదుల సంఖ్యలో టీఆర్‌ఎస్ నాయకులు మరియు వేలల్లో కార్యకర్తలు ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున డబ్బును కూడా పల్లా ఖర్చు చేశారని అంటున్నారు. అయినా కూడా పల్లా విజయ అవకాశాలను తీన్మార్ మల్లన్న తీవ్రంగా ప్రభావితం చేసినట్లుగా చెబుతున్నారు. పోటీ అనేది పల్లా మరియు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్మార్‌ మల్లన్న మద్య ఉందని అంటున్నారు. కోదండరామ్ సారు కూడా పోటీ చేసినా కూడా జనాలు ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.

teenmar mallana

teenmar mallana

సోషల్‌ మీడియాలో తీన్మార్ మల్లన్న చేసిన ప్రచారం మరియు అన్ని జిల్లాలను కవర్‌ చేసి ప్రచారం చేసిన తీరు పట్టభద్రులను ఆకట్టుకుందట. అందుకే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి మల్లన్న గట్టి పోటీ ఇవ్వడంతో పాటు కేసీఆర్ కు షాక్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొదటి నుండి కేసీఆర్ మరియు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీని ఇరుకున పెడుతూ వస్తున్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే సంచలనమే. కేసీఆర్ కు ఇది గట్టి చెంప పెట్టు అన్నట్లుగా సోషల్ మీడియా జనాలు అంటున్నారు. ఒక వేళ తీన్మార్ మల్లన్న గెలువకపోయినా నెం.2 గా నిలిచినా కూడా కేసీఆర్‌ పై ఆయన విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> CM KCR : కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత క్యాబినెట్‌లో మార్పులు..?

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది