KCR : కేసీఆర్ ఆపరేషన్ సక్సెస్.. సర్జరీ తర్వాత వాకర్ సాయంతో నడుస్తున్న కేసీఆర్.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ ఆపరేషన్ సక్సెస్.. సర్జరీ తర్వాత వాకర్ సాయంతో నడుస్తున్న కేసీఆర్.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :9 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  వాకర్ సాయంతో అడుగులు వేసిన కేసీఆర్

  •  కేసీఆర్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరం

  •  కేసీఆర్ తోనే ఉన్న కుటుంబ సభ్యులు

KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి బాత్ రూమ్ లో కాలు జారి ఆయన కింద పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలు తుంటికి గాయం అయింది. దీంతో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీని కేసీఆర్ కు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. సర్జరీని శుక్రవారమే నిర్వహించారు. సర్జరీ సక్సెస్ అయంది. ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని.. తుంటి మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతం అయినట్టు డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు డాక్టర్లు కేసీఆర్ కు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

కేసీఆర్ ను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆపరేషన్ అయ్యేంత వరకు, ఆ తర్వాత ఇప్పటికీ కేటీఆర్, ఆయన కొడుకు హిమాన్షు, కేసీఆర్ తల్లి, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్.. బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ ఆసుపత్రిలోనే ఉన్నారు. తుంటి మార్పిడి సర్జరీ పూర్తయ్యాక కేసీఆర్ ను వేరే రూమ్ కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం డాక్టర్లు కేసీఆర్ కు నడక నేర్పించారు. ఉదయమే వాకర్ సాయంతో నడకను ప్రాక్టీస్ చేయించారు. వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యశోద ఆసుపత్రికి చెందిన సీనియర్ ఆర్ధోపెడిక్ డాక్టర్లు, కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేశారు.

KCR : కేసీఆర్ కోలుకోవడానికి 8 వారాల సమయం

ఇక.. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఒకవేళ ఆయన 6 వారాలు ఆసుపత్రిలోనే ఉంటారా? లేక ఇంటికి తీసుకెళ్తారా? అనేది తెలియదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది