Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2025,1:31 pm

ప్రధానాంశాలు:

  •  Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి స్పష్టంగా వ్యక్తం చేస్తూ, మంత్రి పదవికంటే ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమన్నా, మంత్రి పదవి హామీ ఇచ్చినా, తాను మునుగోడునే వదలలేదని చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఉన్నారని పేర్కొన్నారు.

Komatireddy Raj Gopal Reddy అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy : ఇక ప్రభుత్వం పై తగ్గేదేలే అని తేల్చి చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్

రైతుబంధు పథకం విషయంలో కూడా ఆయన నిర్మొహమాటంగా మాట్లాడారు. “రైతుబంధు అందరికి రాలేదు, కొందరికే వచ్చింది. ఇది నిజం.. నేను ఒప్పుకుంటాను” అంటూ ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “2034 వరకు నేనే సీఎంగా ఉంటా” అన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నియమాలను అతిక్రమించే ప్రకటనలతో పార్టీ పేరు మసకబారుతుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినందున అధిష్టానం నిర్ణయమే కీలకం అన్నారు.

గతంలో బీజేపీలో చేరిన తర్వాత, ఆశించిన ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన కోమటిరెడ్డి, మునుగోడు ఉప ఎన్నికలో కూడా నైతిక విజయం తనదేనని పేర్కొన్నారు. 2018లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థిగా తనను గుర్తు చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మునుగోడు నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. మునుగోడులో ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇలా మంత్రి పదవుల కన్నా ప్రజల సంక్షేమమే తనకు ప్రాధాన్యత అని మరోసారి చాటిచెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది