అసంతృప్తి సెగలు … కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
komatireddy venkatareddy తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు నియమించిన 24 గంటలకు కూడా కాకముందే కాంగ్రెస్‌లో అసంతృప్తి మొదలైంది. నిన్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ అధ్యక్షుడుగా నియమించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా భునగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి komatireddy venkatareddy టీపీసీసీ నియామకంపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి komatireddy venkatareddy

komatireddy venkatareddy
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ రేవంత్ రెడ్డి నియామకంతో టీపీసీసీ… టీడీపీ పీసీసీగా మారిందని .. ఇక నేను గాంధీభవన్ మెట్లు ఎప్పుడూ ఎక్కనని కోమటిరెడ్డి తెలిపారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవ్వరు నన్ను కవలద్దు అని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై కామెంట్ చేశాడు.
తన రాజకీయ భవిష్యత్తు నా కార్యకర్తలు నిర్ణయిస్తారని కోమటిరెడ్డి komatireddy venkatareddy తెలిపారు. టీపీసీసీ పదవిని ఇంచార్జి అమ్ముకున్నాడని, తర్వలో సాక్షాలతో సహా బయటపెడుతానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలైనాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదుపరి కార్యచరణ ఏంటో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.