KTR : నార్కో టెస్ట్ కి నేను సిద్ధం నువ్వు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్…!
ప్రధానాంశాలు:
KTR : నార్కో టెస్ట్ కి నేను సిద్ధం నువ్వు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్...!
KTR : తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ వ్యవహారంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అవసరం అయితే నార్కో అనాలసిస్ లేదా లైట్ డిటెక్ట్ టెస్టులకు అయినా సరే తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.దీంతో ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.
KTR : నార్కో టెస్ట్ కి నేను సిద్ధం మీరు సిద్ధమా…
గత కొంతకాలంగా ఫోన్ టాపింగ్ వ్యవహారంపై నిత్యం ఏదో ఒకరకంగా సీఎం రేవంత్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ పై ఏదో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ నార్కో టెస్ట్ కి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి తాను సిద్ధంగా ఉన్నానని , నాతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరాడు. అసలు ఫోన్ టాపింగ్ చేస్తుంది రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. నా ఫోన్ తో పాటు వారి పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , ఉత్తంకుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR : రేవంత్ రెడ్డికి ఆ దమ్ము లేదు…
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి తాము ఫోన్ టాపింగ్ చేయడం లేదని చెప్పే దమ్ము లేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. అదేవిధంగా కేంద్రం పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుల ఫోన్లను టాప్ చేస్తుంది తాము కాదని చెప్పే ధైర్యం కిషన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ప్రజలందరి సమక్షంలో తన చిత్తశుద్ధిని పరీక్షించుకోవడానికి ఎలాంటి పరీక్షలకైనా సరే తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. బహిరంగ చర్చల కైనా సరే తాను వెనుకాడ బోనని తెలియజేశారు.
ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు ఒక్కసారైనా అధికారిక ప్రకటన వచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ప్రతిరోజు మీడియాకు లీకు ఇస్తున్న లీక్ వీరుడు ఈ విషయంపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని ప్రశ్నించారు. నిజంగా ఫోన్ టాపింగ్ అనేది జరిగి ఉంటే సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించి కోర్టులో నిరూపించాల్సిందిగా కేటీఆర్ కోరారు.
KTR : ప్రభుత్వం నీదే కదా…
ప్రభుత్వం మీదైనప్పుడు ఈ కేసు వ్యవహారంలో నిన్ను ఎవడు ఆపుతాడు అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. నీ ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ఆధారాలతో సహా ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని కోర్టు ముందు ఉంచండి అంటూ సవాల్ విసిరాడు. ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే వచ్చిందని , వారి అధికారంలో ఉన్నప్పుడు నుంచి జరుగుతుందని , అలాగే మన్మోహన్ సింగ్ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు కేటీఆర్.