KTR : చంద్రబాబు అడుగుజాడలలో కేటీఆర్ నడుస్తున్నాడా..!
ప్రధానాంశాలు:
KTR : చంద్రబాబు అడుగుజాడలలో కేటీఆర్ నడుస్తున్నాడా..!
KTR : కేసీఆర్ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఒక దశలో తాను రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ, ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే చంద్రబాబుకు ఉన్న కొన్ని గుణాలు కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. చంద్రబాబు ఎంత కావాలనుకున్నా మాస్ లీడర్ కాలేకపోయారు. ఆయన్ను ముఖ్యమంత్రి అనే కన్నా సీఈవోగానే గుర్తించేందుకు ఇష్టపడతారు.
KTR రూట్ మార్చు..
ఇమేజ్ కోసం.. రోజువారీ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు పడే తపన అంతా ఇంతా కాదు. ఇలాంటి సుగుణాలన్ని కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. అందుకే ఆయన్నుచూసినప్పుడు.. ఆయన మాటల్ని జాగ్రత్తగా వింటున్నప్పుడు పొలిటికల్ గా చంద్రబాబు అడగుజాడల్లో నడుస్తున్నట్లుగా కనిపిస్తారు.జైలుకు ముందు చంద్రబాబు మాటల్లో అర్థ్రత కనిపించదు. కేటీఆర్ లోనూ అలాంటి పరిస్థితి. ఆగ్రహం.. కోపం.. అసహనం.. అన్నీ అరువుకు తెచ్చుకున్నట్లుగా ఉంటాయే తప్పించి సహజసిద్ధంగా కనిపించవు. అందుకే.. పొలిటికల్ యాంగిల్ లో కేటీఆర్ ను చూసినప్పుడు చంద్రబాబుకు జూనియర్ అన్నట్లుగా కనిపిస్తారు. ఈ విషయాల్ని కేటీఆర్ గుర్తించారో లేదో తెలీదు. కానీ.. ఆయన వీలైనంత త్వరగా చంద్రబాబు అడుగు జాడలలో కాకుండా తన తండ్రి బాటలో వెళితే మంచిదని అంటున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయన్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు.ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవన్నారు. ఒక దశలో తాను రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు.