Farmers : రైతులకు గుడ్‌న్యూస్.. 30న అకౌంట్‌లో డబ్బులు..!
ప్రధానాంశాలు:
Farmers : రైతులకు గుడ్‌న్యూస్.. 30న అకౌంట్‌లో డబ్బులు..!
Farmers : తెలంగాణ Telangana ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం 3 విడతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. మెుత్తం రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే అర్హతలు ఉన్నా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో రుణ మాఫీ కాలేదు.
దాతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వ్యవసాయ అధికారులు వారి వివరాలు సేకరించారు. తాజాగా ఆయా రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు అందించారు. వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరగలేదని, ఆయా రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 30న పాలమూరులో రైతు పండగ కార్యక్రమం జరుగనున్నట్లు, ఈ వేదికగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే రైతు భరోసా పథకంపైనా మంత్రి కీలక సమాచారం అందజేశారు. రుణమాఫీ పూర్తి అయిన అనంతరం త్వరలోనే రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15 వేలు పంట పెట్టుబడి సాయం రైతులకు అందించనుంది.Loan waiver of Rs 2 lakhs for all eligible farmers on 30th