Seethakka VS KTR : అసెంబ్లీలో మంత్రి సీతక్క పవర్ ఫుల్ స్పీచ్ అదిరిపోయింది
ప్రధానాంశాలు:
మంత్రిగా అసెంబ్లీలో సీతక్క తొలి స్పీచ్ అదిరింది
గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీతక్క
Seethakka VS KTR : మంత్రి సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను పవర్ ఫుల్ లీడర్. తెలంగాణ వ్యాప్తంగా తనకు చాలా పాపులారిటీ ఉంది. ములుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతక్కకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీతక్క తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి కాగానే అసెంబ్లీలో సీతక్క పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ కు హౌస్ మొత్తం ఫిదా అయిపోయింది. మద్యపానం సమయాలు తగ్గించాలని.. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని సీతక్క స్పష్టం చేశారు.
ఆ షాపుల వేళలను తగ్గించాలని సీఎంను కోరారు. మనం ఎక్కడికి వెళ్లినా పని చేసుకోవాల్సిన వాళ్లు మద్యం షాపుల వద్ద ఉంటున్నారన్నారు. గత కొన్నేళ్ల నుంచి పరిశ్రమలు మూతపడ్డాయని సీతక్క అన్నారు. ప్రత్యేకంగా చొరవ తీసుకొని మూత పడిన పరిశ్రమలకు తెరిపించాలని కోరారు. గతంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. అందుకే వాటిని వెంటనే ఈ కొత్త ప్రభుత్వంలో తెరిపించాలని ఆమె అన్నారు. ఐటీ ఇండస్ట్రీని కూడా హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. మన జిల్లాల్లోనూ విస్తరించాలని ఆమె కోరారు. వికలాంగుల ఉపాధి కోసం ప్రత్యేక పథకాలను తీసుకురావాలన్నారు. వికలాంగుల కోసం ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
Seethakka VS KTR : ప్రభుత్వ రంగ సంస్థలను దోచుకుంటున్నారు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటున్నారని.. ఇది వరకు ప్రభుత్వంలో అదే జరిగిందని ప్రభుత్వం అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని సీతక్క అన్నారు. ఇప్పటి వరకు ఐటీ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై తనదైన శైలిలో మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు.