Mynampally Hanumanth Rao : కొడుకు కోసం మైనంపల్లి మరో భారీ త్యాగం.. అసలు సీక్రెట్ తెలిస్తే షాక్..!
Mynampally Hanumanth Rao : రాజకీయాల్లో మైనంపల్లి హన్మంతరావుకు ఓ క్రేజ్ ఉంది. ఆయన ఒకప్పుడు మెదక్ నుంచి గెలిస్తే.. ఆ తర్వాత మల్కాజిగిరికి షిఫ్ట్ అయ్యాడు. అయితే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిగా తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ కావాలని కేసీఆర్ ముందు డిమాండ్ పెట్టారు. కానీ హన్మంతరావుకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చిన కేసీఆర్ ఆయన కొడుక్కు మాత్రం నిరాకరించారు. దాంతో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసి కూడా హన్మంతరావు తన కొడుకు కోసం రిస్క్ చేసి కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ నుంచి తండ్రి, కొడుకులు టికెట్ తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ మరో ఆఫర్..
అయితే మల్కాజిగిరిలో ఊహించినట్టుగానే బీఆర్ఎస్ గెలిచింది. కానీ మెదక్ నుంచి రోహిత్ గెలిచి సత్తా చాటారు. అయితే కొడుకు కోసం హన్మంతరావు మరో త్యాగం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆయనకు మరో భారీ ఆఫర్ చేసిందంట. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తానంటే ఈ సారి కూడా కొడుకు కోసం వద్దన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా రోహిత్ ను కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు హస్తినకు పిలిపించుకున్నారు. కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొందరు ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే రోహిత్ కు తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారంట. దీనికి కారణం రాహుల్ కోసమే.
రాహుల్ గాంధీ ఇప్పుడు యువకులను కాంగ్రెస్ లో ప్రోత్సహిస్తున్నరు. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపిన్న వయస్కుడైన రోహిత్ కు మంత్రి పదవి ఇస్తే అది తన ఇమేజ్ ను పెంచుతుందని రాహుల్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు రోహిత్ కు మంత్రి పదవిపై చర్చలు జరుగుతున్నాయంట. రోహిత్ కు మంత్రి పదవి ఇస్తే రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడంతో పాటు ఇటు తండ్రీ, కొడుకుల కోటాలో ఒక పదవి ఇచ్చి సెట్ చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ కూడా సానుకూలంగా ఉన్నారంట. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న మైనంపల్లి తనకు ఎంపీ టికెట్ వద్దని.. కొడుకుకు మాత్రం మంత్రి పదవి ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారంట. చూడాలి మరి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.