Loan : మహిళలకు అలర్ట్… 30 శాతం సబ్సీడీతో 5 లక్షలు.. నెలకు 5 వేలు కడితే చాలంటూ భారీ స్కాం..!
ప్రధానాంశాలు:
Loan : మహిళలకు అలర్ట్... 30 శాతం సబ్సీడీతో 5 లక్షలు.. నెలకు 5 వేలు కడితే చాలంటూ భారీ స్కాం..!
Loan : మహిళలు కచ్చితంగా ఈ విషయాన్న్ని తెలుసుకోవాలి. లేదంటే మాత్రం కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. పధాన మంత్రి ఉపాదన కల్పన కార్యక్రమం కింద రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి కొందరు మహిళలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబా లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 33 ఏళ్ల మహిళకు లోన్ వస్తుందని మాయమాటలు చెప్పి ఆమె దగ్గర ఏకంగా 132000 రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. అందుకే మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Loan అసలు మోసం ఎలా చేశాడంటే..
ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసగాడి నుంచి మహిళకు ఫోన్ రాఅ ఆమె హైదరాబా లో పీ.ఎం.ఈ.జీ.పీకి సంబందించిన ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్ అని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు 5 లక్షల దాకా రుణం ఇస్తామని చెప్పి ఆ మహిళను నమ్మబలికాడు. 30 శాతం సబ్సీడీతో మంజురైందని కూడా ఆమెకు చెప్పాడు. రుణం కోసం నెల వారీ 5480 రూపాయలు నెల వారీ ఈ.ఎం.ఐ కట్టాలని బాధితురాలికి చెప్పారు. అలా లోన్ సాంక్షన్ అయ్యిందని చెప్పి ఆమె దగ్గర ఉన్న డబ్బులు లూటీ చేశాడు. ఆమె హార్జీల నిమిత్తం అతనికి 1.32 లక్షల దాకా ట్రాన్స ఫర్ చేసినట్టు తెలిసింది.
డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీ అని చెప్పి కొంత మొత్తం ఇలా మొత్తానికి లక్షన్నర దాకా టోకరా పెట్టాడు. ఐతే ఆ మహిళ ఇచ్చిన కంప్లైట్ తో సైబర్ క్రైం పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు. లోన్ అనగానే మహిళలు ఏం చేస్తే వస్తాయనే తొందరపాటు తప్ప అసలు అవతల వ్యక్తి ఎవరు ఏంటి అని ఆధారాలు అడగరు. అలాంటి టైం లోనే వారిని మోసం చేసి ఇవతల వారు డబ్బులు దోచేస్తుంటారు. మహిళలనే టార్గెట్ చేస్తూ కొందరు కేటుగాళ్లు ఇలాంటి ప్లాన్స్ చేస్తుంటారు. ఐతే బాహిత మహిళకు ఆ నగదు తిరిగి ఇప్పించేలా కేసుని బలం గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. PMEGP Woman Duped 1.32 Lakhs Fraud Agent , PMEGP, Woman, Fraud Agent, Loan,