Ponnam Prabhakar : అలిగిన మంత్రి పొన్నం, మేయర్.. బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద వివాదానికి కారణం ఇదే
ప్రధానాంశాలు:
Ponnam Prabhakar : అలిగిన మంత్రి పొన్నం, మేయర్.. బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద వివాదానికి కారణం ఇదే
Ponnam Prabhakar : హైదరాబాద్ లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ప్రతి ఏడాది ఆషాడమాసం లో తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. లక్షల కొద్దీ భక్తులు అక్కడకు వచ్చి అమ్మవారి అశీర్వాదాలు తీసుకుంటారు. ఐతే నేడు కేంద్రం మంత్రులు కిషన్ రెడ్డి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సతీసమేతంగా అమ్మ వారి ఆశీవ్దాలా కోసం వచ్చారు.అంతకుముందే మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లారు. ఐతే పొన్నం ప్రభాకర్ వచ్చిన సమయానికి అక్కడ అధికారులు ఎవ్వరు లేరు. మంత్రి వచ్చినప్పుడు ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు కచ్చితంగా ఉండాలి. ప్రోటోకాల్ మిస్ అయ్యారు. దీనిపై హర్ట్ అయిన పొన్నం ప్రభాకర్ గుడి బయట వెయిట్ చేశారు. మరోపక్క మేయర్ విజయలక్ష్మికి కూడా ఇదే జరిగిందట.
Ponnam Prabhakar గుడి బయటే ఉన్న మంత్రి పొన్నం
పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ఇద్దరు గుడి బయట కూర్చుని ఉన్నారు. అధికారులు వచ్చాక వారిపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత గుడి లోపలకి వెళ్లారు. ఐతే అధికారులపై సీరియస్ అయిన పొన్నం ప్రభాకర్ అలిగి గుడి బయట కూర్చున్నారని మీడియా కథనాలు రాసింది. దానికి ఆన్సర్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్ తాను బయట క్యూ లైన్ ని పరిశీలిస్తున్నానని.. మేయర్ తో పాటు ఒక గర్భిణి కూడా కింద పడబోయిందని అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని అన్నారు.
మీడియా ముందు అలా చెప్పారు కానీ అధికారులు ఎవరు లేరని పొన్నం ప్రభాకర్ ఒకింత అసహనాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. మంత్రిగా తను టెంపుల్ కి వస్తే అక్కడ ఐ.పి.ఎస్ అధికారులు ఎవరు లేకపోవడం వల్లే ఆయన హర్ట్ అయ్యి అలా బయట కూర్చున్నారని కొందరు అంటున్నారు. నేడు కళ్యాణోత్సవం జరగ్గా రేపటితో ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్క వారంతా కూడా ఎల్లమ్మ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అటెండ్ అవుతున్నారు. అమ్మ వారి చల్లని దీవనలు తమపై ఉండాలని మొక్కులు చెల్లిస్తున్నారు.