Ponnam Prabhakar : పొన్నం ప్రభాకర్‌కి చెక్ పెట్టి జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారా..!
Ponnam Prabhakar : తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గరైన జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దళ్లి శ్రీధర్ బాబు లు జీవన్ ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు.. దీంతో ఆయన చల్ల బడ్డారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు.
Ponnam Prabhakar : మంత్రి వర్గ వస్తరణలో ఏం చేస్తారు..
వెంటనే ఆయనని ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీని కలిసేందుకు జీవన్ రెడ్డి ఢిల్లీకి బయలు దేరారు..జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పంపించే బాద్యతలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని హూంకరించడంతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని ప్రకటించడం జీవన్‌రెడ్డి మార్కు రాజకీయంగా చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. వరుసగా ఓడినా కాంగ్రెస్‌లో తన ఉనికి చాటుకుంటున్న జీవన్‌రెడ్డి… ప్రత్యక్ష రాజకీయాలకు దూరమంటూనే తన నియోజకవర్గ పరిణామాలను వదలకపోవడం… ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తుండటం వెనుక చాలా పెద్ద స్కెచ్చే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌కి మంత్రి పదువులు వరించాయి. ఈ సారి జీవన్ రెడ్డి ఎన్నికలలో ఓడిపోవడంతో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన అలడంతో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్.. జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. మరి కొద్ది రోజులలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Ponnam Prabhakar : పొన్నం ప్రభాకర్‌కి చెక్ పెట్టి జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారా..!
జూలై 3 లేదా 4న మిగిలిన ఆరు పదవులని భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి కసరత్తులు చేస్తున్నాడట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే పొన్నంని తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, రేవంత్ రెడ్డి రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ.. 2021 జూన్ 27 నాడు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. జులై 7న చార్జ్ తీసుకున్నాను. మూడేళ్ళతో నా పదవీకాలం ముగుస్తుంది. కొత్త పీసీసీని ఎంపిక చేయాలని అధిష్టానాన్ని కోరాను.జగిత్యాల అభివృద్ధి కోసం అక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారని, జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు