Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. రానివాళ్లు ఇలా అప్లైచేసుకోండి..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. రానివాళ్లు ఇలా అప్లైచేసుకోండి..!
Rythu Bharosa : కాంగ్రెస్ పార్టీ Congress Party అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విషయంపై చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతు సోదరులు అందరూ కూడా రైతు భరోసా Rythu Bharosa పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు farmers సోదరులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా డబ్బుల విషయం పై కీలక ప్రకటన వచ్చింది. అదేంటంటే.. ఇప్పటి నుంచి ముందుగానే బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. మరి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. రానివాళ్లు ఇలా అప్లైచేసుకోండి..!
Rythu Bharosa నివాళ్లు ఇలా అప్లైచేసుకోండి..!
నిజానికి రైతు భరోసా డబ్బులను మార్చి నెల చివరిలోనే అర్హులైన రైతులు అందరికి అందిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ రైతు భరోసా విషయం పై కీలక ప్రకటన చేశారు. ఈ ,సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల చివరి కల్ల అర్హులైన రైతులందరికి రైతు భరోసా అందచేస్తామని తెలిపారు.
అదేవిధంగా అర్హత కలిగి ఉండి రైతు భరోసా రాని రైతులకు farmers కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా డబ్బులు రాని రైతులు తమ బ్యాంక్ పాస్ బుక్ మరియు సర్వే నెంబర్ వంటి వివరాలను కార్యాలయంలో ఇవ్వాలని తెలియజేశారు. కావున అర్హులైన రైతులందరు కూడా వీలైనంత త్వరగా వివరాలని సమర్పించాలని తేలియజేసారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లను కల్పిస్తామని దీనిని చట్టం చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. ఇక ఈ విషయాన్ని అసెంబ్లీ తీర్మానం తరువాత పార్లమెంటుకు పంపిస్తామని తెలియజేశారు.