Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం కు సంబదించిన కీలక అప్డేట్..!
ప్రధానాంశాలు:
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం కు సంబదించిన కీలక అప్డేట్..!
Rajiv Yuva Vikasam : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 90 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో, మరో 30 వేల దరఖాస్తులు ప్రత్యక్షంగా అందాయని అధికారులు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు ఉన్నా, వార్డు కార్యాలయాలు బహిరంగంగా ఉండి దరఖాస్తులను స్వీకరిస్తాయన్నారు.

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం కు సంబదించిన కీలక అప్డేట్..!
Rajiv Yuva Vikasam ఆన్ లైన్ లో రాజీవ్ యువ వికాసానికి అప్లయ్ చేసిన వారు మళ్లీ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు మళ్లీ కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, వారు ఫైనల్ గా అప్లై చేసినట్లే పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఆన్‌లైన్‌పై అవగాహన లేని అభ్యర్థులు GHMC వార్డు ఆఫీసుల్లో ప్రత్యక్షంగా వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై రాజీవ్ యువ వికాసం జిల్లా కన్వీనర్ రమేశ్ వివరాలు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండటం సర్వసాధారణం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అద్భుత స్పందన లభించినట్టు అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువకుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా సెలెక్ట్ అయిన వారికి జూన్ 2 నుంచి శాంక్షన్ లెటర్లు అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.