2024 Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలడా ..??
2024 Rajya Sabha Elections : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాకరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. బీఆర్ఎస్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, మడుగుల లింగయ్య యాదవ్ పదవి కాలం ముగియనుంది. వీరి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందు మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా అప్పుడే పతాకస్థాయి లో ఉంటాయి. అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లే సమయం మార్చి లోనే ఉంటుంది. అప్పుడు పొలిటికల్ ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. అందుకే బీఆర్ఎస్ కు కొత్త టెన్షన్ ప్రారంభమైంది. తెలంగాణలో 119 మంది శాసన సభ్యులు ఉన్నారు.
మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కరికి 40 మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సిబిఐతో కలిపి 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది, మజిలీకి ఏడుగురు ఉన్నారు. బిజెపికి మజిలీస్ కి పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ రెండు పార్టీలను తీసేస్తే 104 మంది సభ్యుల ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 35 మంది అభ్యర్థులు సరిపోతాయి. దీంతో బీఆర్ఎస్ కి ఒక సీటు ఖాయం. పోటీ ఉండదు కాబట్టి మిగిలిన రెండు కాంగ్రెస్ కు ఖాయం. అయితే ఇది ఎవరు పోటీ చేయకపోతేనే. ఒకవేళ పోటీ చేస్తే కాంగ్రెస్కు ఇబ్బందికరము కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడం వలన పార్టీకి ముప్పు ఉండదు.
మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగ్ తో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారు ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. మూడుకు మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యం అవుతుంది. అప్పటి మొదటి మూడు స్థానాలు అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ రెండు స్థానాలకు పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేస్తే ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ కు అవసరమైనప్పుడు మద్దతు ఇస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో బి ఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.