Raksha Bandhan : రాఖీ క‌ట్టేందుకు వెళుతూ ఆర్టీసీ బ‌స్సులో పురిటినొప్పులు.. డెలివ‌రీ చేసిన కండక్ట‌ర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raksha Bandhan : రాఖీ క‌ట్టేందుకు వెళుతూ ఆర్టీసీ బ‌స్సులో పురిటినొప్పులు.. డెలివ‌రీ చేసిన కండక్ట‌ర్..!

Raksha Bandhan : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ‌ని ప్ర‌తి ఏడాది జ‌రుపుకుంటాం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొనే ఈ పండుగ వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే రాఖీ పండ‌గ రోజు జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు అంద‌రిని కంట‌త‌డి పెట్టిస్తున్నాయి. గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిందని తెలిసినా సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి వెళ్తూ మార్గ మధ్యలోనే ప్రసవించారు. ఆర్టీసీ బస్‌లో ప్రసవ నొప్పులు రావ‌డంతో ఆమెకి […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,2:00 pm

Raksha Bandhan : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ‌ని ప్ర‌తి ఏడాది జ‌రుపుకుంటాం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొనే ఈ పండుగ వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే రాఖీ పండ‌గ రోజు జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు అంద‌రిని కంట‌త‌డి పెట్టిస్తున్నాయి. గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిందని తెలిసినా సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి వెళ్తూ మార్గ మధ్యలోనే ప్రసవించారు. ఆర్టీసీ బస్‌లో ప్రసవ నొప్పులు రావ‌డంతో ఆమెకి బస్సులో ప్రసవం చేశారు. సోదరుడికి రాఖీ కట్టేందుకు బయల్దేరిన నిండు చూలాలు.. బస్సులోనే ప్రసవించింది. సదరు బస్సులో లేడీ కండక్టర్‌తో పాటు ఓ నర్సు అందుబాటులో ఉండటంతో ఆమెకు దగ్గరుండి డెలివరీ చేయించారు. గద్వాల్ నుంచి వనపర్తి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.

Raksha Bandhan బ‌స్సులోనే డెలివ‌రీ

గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ఉన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. సంధ్య పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. 108 పిలిచి తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Raksha Bandhan రాఖీ క‌ట్టేందుకు వెళుతూ ఆర్టీసీ బ‌స్సులో పురిటినొప్పులు డెలివ‌రీ చేసిన కండక్ట‌ర్

Raksha Bandhan : రాఖీ క‌ట్టేందుకు వెళుతూ ఆర్టీసీ బ‌స్సులో పురిటినొప్పులు.. డెలివ‌రీ చేసిన కండక్ట‌ర్..!

రాఖీ పండుగ నాడు బస్సులో డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసించారు. మానవత్వం చాటుకున్నారని కితాబు ఇచ్చారు. జరిగిన విషయాన్ని ఎక్స్ వేదికగా వివరించారు. “రక్షాబంధన్‌ రోజున బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి ఆర్టీసీ యాజమాన్యం తరపున అభినందనలు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం అని స‌జ్జ‌నార్ అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది