Revanth Reddy : విద్యార్ధుల కోసం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త పథకం.. వారికి అవన్నీ ఉచితం..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : విద్యార్ధుల కోసం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త పథకం.. వారికి అవన్నీ ఉచితం..!
Revanth Reddy : కాంగ్రెస్‌లోకి కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం అందిపుచ్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి సంచలన నిర్ణయాలతో దూసుకెళ్లిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి మరో ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశారు. ఈసారి విద్యార్థులు తెగ సంతోషించే వార్త వినిపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందు కోసం “తెలంగాణ దర్శిని” అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
Revanth Reddy స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్..
చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఎం కోరారు. రాష్ట్రంలో సంక్షేమం సహా పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. మూసీ పరీవాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నామని.. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పురాతన బావులను దత్తత తీసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చాయి. ఇకపై పురాతన బావులను ప్రక్షాళన చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వారికి ఒప్పంద పత్రాలు అందజేశారు.ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్దరించనుంది. అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఎస్ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనుంది.