Revanth Reddy : బీజేపీ లోకి రేవంత్ రెడ్డి కొత్త ప్లానింగ్ తో దిగిన బీజేపీ హై కమాండ్ !
Revanth Reddy : దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉండేది మొదటిగా కర్ణాటక. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం తెలిసిందే. కర్ణాటక తర్వాత కాస్త కొద్దో గొప్పో తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా ఈ ఏడాది జవరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలవడానికి రెడీ అవుతుంది. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ పై నమ్మకం ఉందని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీనీ పెంచిన సెక్యులర్ పార్టీ మరొకటి లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ పై నమ్మకం ప్రజలకు ఉందని అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. బీజేపీ నుండి తాను మాత్రమే కాదు ఎవరూ పార్టీ మారటం లేదని తెలియజేశారు.
కెసిఆర్ వ్యతిరేకులు ఆయనను ఓడించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు… రేవంత్ రెడ్డి లక్ష్యం తమలక్ష్యం ఒకటేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కెసిఆర్ ను ఢీ కొట్టి ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది కావాలని తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీతో తమకు పొత్తు ఉందని లేకపోతే కవితను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే కవిత అరెస్టు చేయడం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదని అది దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు చేయవలసిన పని అని పేర్కొన్నారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని మాత్రమే పార్టీ కోరుకుంటున్నాట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ముద్ర వేసే రాజకీయ పదం గడపాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆ స్థానం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లంతా దొంగలని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పారని కానీ బీజేపీ నాయకులు ఎప్పుడు ఆంధ్రా వాళ్లు దొంగలని అనలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ.. మాత్రమే అని పేర్కొన్నారు. తమను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినా రేవంత్ రెడ్డి ఆయనే బిజెపిలోకి రావాలంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి రివర్స్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీ నాయకులను కొనటం అంత ఈజీ కాదని తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని ఢీకొనాలంటే.. కరెక్ట్ రేవంత్ రెడ్డి కాబట్టి బిజెపి.. పెద్దలు రేవంత్ నీ కమలం పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అంతర్గతంగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం ఆఫర్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లు సమాచారం.