Revanth Reddy : రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఆ బ్యాచ్ మొత్తానికి వణుకు పుట్టింది.. ఇది కదా అసలైన పాలన అంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఆ బ్యాచ్ మొత్తానికి వణుకు పుట్టింది.. ఇది కదా అసలైన పాలన అంటే

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు కానీ.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏదో గెలిచాం.. అయిపోయింది అనేట్టుగా కాదు.. పక్కాగా పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే అభయ హస్తం ఫైల్ పై సంతకం పెట్టారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారు. తెల్లారి వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో అధికారులతో సమావేశమయ్యారు రేవంత్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  84 వేల కోట్ల కుంభకోణం నిజమేనా?

  •  విద్యుత్ సంస్థ ఇన్ని వేల కోట్ల అప్పుల్లో ఎందుకు కూరుకుపోయింది

  •  ప్రభాకర్ రావు ముందే సర్దేసుకున్నారా?

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు కానీ.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏదో గెలిచాం.. అయిపోయింది అనేట్టుగా కాదు.. పక్కాగా పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే అభయ హస్తం ఫైల్ పై సంతకం పెట్టారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారు. తెల్లారి వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో అధికారులతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ట్రాన్స్ కో ఎండీ ప్రభాకర్ రావు తన పోస్ట్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ఆమోదించకున్నా, సీఎం మీటింగ్ కు ప్రభాకర్ రావు హాజరు కాలేదు. అయితే.. తెలంగాణలో 24 గంటల కరెంట్ పేరుతో 84 వేల కోట్ల స్కామ్ జరిగిందని తెలుస్తోంది. అందుకే ప్రభాకర్ రావు ముందే సర్దేసుకున్నారు అనే వార్తలూ వినిపిస్తున్నాయి.

నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చాలా రోజుల నుంచి విద్యుత్ విషయంలో పెద్ద స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే వెంటననే విద్యుత్ స్కామ్ పై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అన్నీ బయటికి తీస్తామన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కేబినేట్ మీటింగ్ పెట్టిన రోజే విద్యుత్ సంస్కరణలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. సీఎండీ రాజీనామా చేయడంతో రేవంత్ కు ఇంకా డౌట్ పెరిగింది. ఎక్కువ శాతం డబ్బును గత ప్రభుత్వం సొంత అవసరాలను వాడుకున్నట్టు తెలుస్తోంది. 84 వేల కోట్ల అప్పుల్లోకి విద్యుత్ సంస్థను తీసుకెళ్లి.. ఆ డబ్బును అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు అనేది తెలియడం లేదు. నిజంగా 24 గంటల కరెంట్ కోసమే అన్ని వేల కోట్లు అప్పు చేశారా అనే దానిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ సర్కారు అప్పుడే తప్పు చేసిందని చెప్పారు. దానికి బలం చేకూర్చుతూ సీఎండీ రాజీనామా చేయడంతో ఆ ఆరోపణ ఇప్పుడు నిజం అయినట్టుగానే చూడాలి.

Revanth Reddy : విద్యుత్ కుంభకోణంపై కమిటీ

అందుకే.. రేవంత్ రెడ్డి విద్యుత్ సంస్థ కుంభకోణంపై ఒక కమిటీ వేసి ఈ స్కామ్ లో విద్యుత్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు ఎవరు ఉన్నా వాళ్లందరినీ బయటికి లాగుతామని రేవంత్ రెడ్డి చాలెంజ్ విసిరారు. మరి.. విద్యుత్ కుంభకోణాన్ని రేవంత్ రెడ్డి ఏవిధంగా బయటికి లాగుతారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది