Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి మ‌ళ్లీ డ‌బ్బులు… ఈ నెల 23 త‌ర్వాత రైతు భ‌రోసా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి మ‌ళ్లీ డ‌బ్బులు… ఈ నెల 23 త‌ర్వాత రైతు భ‌రోసా

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2025,7:20 pm

Rythu Bharosa : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా సాయాన్ని పూర్తి చేయడానికి తెలంగాణ ప్ర‌భుత్వం వేగంగా పావులు క‌దుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 23 తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చాలావరకు రైతు భరోసా డబ్బుల పెండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.పెండింగ్ లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని… ఈనెల 23 తర్వాత జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

Rythu Bharosa రైతుల ఖాతాల్లోకి మ‌ళ్లీ డ‌బ్బులు ఈ నెల 23 త‌ర్వాత రైతు భ‌రోసా

Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి మ‌ళ్లీ డ‌బ్బులు… ఈ నెల 23 త‌ర్వాత రైతు భ‌రోసా

Rythu Bharosa : గుడ్ న్యూస్..

రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.6వేలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. ఈసారి సమగ్రంగా అన్ని స్థాయిల రైతులకు న్యాయం జరగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు ముందుగానే నిధులు అందించడం లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతోంది.

గతంలో ఏకకాలంలో అందని రైతులకు విడతలవారీగా సాయం ఇవ్వడం ద్వారా వ్యవసాయ ఖర్చులకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. రైతులు పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమవుతున్న ఈ సమయంలో, ఈ నిధులు వారికెంతో ఉపయోగపడతాయని అంచనా. ఈ నెల 23వ తేదీ తర్వాత నాలుగు ఎకరాలు, ఆపైన ఉన్నవారికి కూడా నగదు జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ రైతుబంధు కింద రెండు విడతల్లో 6000 రూపాయల చొప్పున 12000 ఇస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది