Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి ఇంత సౌండ్ ఏంటి ?
ప్రధానాంశాలు:
Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి ఇంత సౌండ్ ఏంటి ?
Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నారు.పలు ప్రభుత్వాలపై సంచలన ఆరోపణలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కారు. ఇటీవల హైదరాబాద్ తాజ్‌కృష్ణలో జరిగిన తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సులో సీఎం రేవంత్, సీనియర్ నేత జానా రెడ్డిపై కీలక కామెంట్స్ చేసిన మల్లన్న మరోసారి అదే తరహా కామెంట్స్ చేశారు. న్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న వ్యవహారశైలి, ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి.
Teenmar Mallanna మల్లన్న ఫైర్..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు మల్లన్న. కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా, లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తానని, వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు మల్లన్న. రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపాన్ని క్రియేట్ చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని హెచ్చరించారు.
బడ్జెట్‌లో బీసీలకు రూ.9 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రభుత్వాన్ని తాను నిర్భయంగా ప్రశ్నించానని మల్లన్న వెల్లడించారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కి బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు తాను వస్తానని మల్లన్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల విషయంలో రెడ్డి సామాజికవర్గం నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్‌లోనూ ఈ అంశంపై చర్చించారు. ఇక అడ్వకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ కొట్టిపారేశారంటూ ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మల్లన్న మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.