Harish Rao Vs Komati Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు వ్యాఖ్యలపై సీరియస్ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harish Rao Vs Komati Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు వ్యాఖ్యలపై సీరియస్ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Harish Rao Vs Komati Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయగా, దానిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ హరీష్ రావు మధ్య కాసేపు చర్చ నడిచింది. ఇరువైపులా వ్యక్తిగత కామెంట్స్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో శ్వేత పత్రం విడుదల చేశారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :21 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Harish Rao Vs Komati Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు వ్యాఖ్యలపై సీరియస్ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Harish Rao Vs Komati Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయగా, దానిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ హరీష్ రావు మధ్య కాసేపు చర్చ నడిచింది. ఇరువైపులా వ్యక్తిగత కామెంట్స్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో శ్వేత పత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలని ధోరణితో ఇలా చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. శ్వేత పత్రంలోని వివరాలని శుద్ధ తప్పుగా కొట్టి పారేశారు. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడే సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డుపడ్డారు. ఈ క్రమంలోనే నువ్వు ఎంత అరిచిన నీకు మంత్రి పదవి దక్కదు లే అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు.

అయితే అదే విషయాన్ని ప్రస్తావించిన కోమటిరెడ్డి.. హరీష్ రావుకు మేనమామ కేసీఆర్ పోలికలు వచ్చాయని, అబద్ధాలను నిజాలుగా చెప్పడం అలవాటైపోయిందని అన్నారు. అక్కడితో ఆగకుండా నువ్వు ఎంత కష్టపడ్డా సీఎం కాలేవని, కెసిఆర్ తర్వాత కేటీఆర్ నేనని. వాళ్లు నిన్ను పూర్తిగా వాడుకుని వదిలేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో కాసేపు గందర గోళం నెలకొంది. దీనిపై స్పందించిన హరీష్ రావు పీసీసీ అధ్యక్ష పదవిని 50 వేల కోట్లు పెట్టి కొనుక్కున్నాడంటూ గతంలో స్వయంగా కోమటిరెడ్డి బ్రదర్సే చెప్పుకొచ్చారని ఆరోపించారు. దీంతో సభలో మరోసారి కాంగ్రెస్ సభ్యులంతా విరుచుకుపడ్డారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.

దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందించారు. తమ ప్రభుత్వం చేసిన పనులు గురించి చెప్పుకోవాలి కానీ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఇల్లు కట్టించారు చెప్పుకోవాలి తప్ప ఎప్పుడో జరిగిన వాటిని సభలో తీసుకురావడం సరికాదని స్పష్టం చేశారు. తాను కూడా మాట్లాడాలంటే బావ బామ్మర్దుల మధ్య ఎన్ని కోట్లాటలు జరుగుతున్నాయో చెబుతానంటూ హెచ్చరించారు. ఇక హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందించిన స్పీకర్ వాటిని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తాను కూడా సిద్ధమని చెప్పారు. ఎవరు విత్ డ్రా చేసుకోకపోవడంతో స్పీకర్ హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది